కొత్త సంవత్సరం వచ్చేసింది. కొత్త క్యాలెండర్ ఆవిష్కరణ కూడా ప్రస్తుతం విజయవంతంగా కొనసాగుతోంది. అలాగే జీవిత అనుభవాలను కవిత్వంగా మలిచి... ఆ కవిత్వాన్ని మంచిమాటలు గా మార్చి... కొటేషన్ల రూపకంగా ప్రతి సంవత్సరం క్యాలెండర్ ను అందించే కవి కొత్త శ్రీనివాస్ రూపొందించిన 2022 క్యాలెండర్ నిన్న ఆవిష్కృతమైంది. ఈ క్యాలెండర్ ను ప్రగతిభవన్ లో ఆవిష్కరించారు తెలంగాణ మంత్రివర్యులు కల్వకుంట్ల తారక రామారావు.  ఇక ఈ కార్యక్రమం అనంతరం క్యాలెండరు రూపకర్త, రచయిత కొత్త శ్రీనివాస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.  మహాకవి శ్రీశ్రీ అన్నట్లు మానవ జీవితమే ఒక మహాభారతం, అది మన నుంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణ అని ఆయన పేర్కొన్నారు కొత్త శ్రీనివాస్. కురుక్షేత్ర యుద్ధం జరుగుతున్న సమయంలో శ్రీకృష్ణ భగవంతుడు చెప్పే మాటలను ప్రభావితమైన అర్జునుడు ఉత్సాహంగా.. యుద్ధ భేరి లో గెలిచాడని... అలాగే శల్యుడు అన్న మాటలకు ప్రభావితుడైన కర్ణుడు నిరుత్సాహానికి లోనయ్యారు యుద్ధంలో ఓడిపోయాడు అని స్పష్టం చేశారు కొత్త శ్రీనివాస్ .

 మంచి మాటలకు అలాగే చెడ్డ మాటలకు మనుషుల జీవితాలను ఎలా ప్రభావితం అవుతాయి అనేదానికి మహాభారతం అనేది ఒక్క ఉదాహరణ అని ఆయన వెల్లడించారు కొత్త శ్రీనివాస్. అలాగే మన జీవితంలో మనకు ఎదురయ్యే ఎటువంటి అనేక రకాల సమస్యలను ఎదుర్కోవడానికి.. అప్పటి పరిస్థితులను విశ్లేషించే గలిగే విచక్షణ పెంచుకోవడానికి మంచి మాటలు వినడం ద్వారా అలాగే మంచి రచనలు చదవడం ద్వారా మనం ఆత్మ విశ్వాసాన్ని పెంపొందించుకోవాలి అని కొత్త శ్రీనివాస్ తెలిపారు. అలాగే తన అనుభవాల్లోంచి నేర్చుకున్న జీవిత పాఠాలను మంచి మాటల రూపంలో క్యాలెండర్లు రూపొందిస్తే గత ఎనిమిది సంవత్సరాలుగా అందరికీ అందిస్తున్నామని కొత్త శ్రీనివాస్ స్పష్టం చేశారు. ప్రతి మనిషి పాజిటివ్ కోణంలో జీవిస్తే అన్ని మంచి జరుగుతాయి.. ఇప్పుడు మనం పాజిటివ్ యాంగిల్ లో నే ఆలోచించాలని అలా చేస్తే అనేక సమస్యలకు మనం చెక్ పెట్టవచ్చని కొత్త శ్రీనివాస్ తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ktr