ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పీఆర్సీపై ఇచ్చిన ఉత్తర్వులను ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు తీవ్ర స్థాయిలో వ్యతిరేకిస్తున్నాయ్ అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే పి ఆర్ సి పై జగన్ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను వెంటనే వెనక్కి తీసుకోవాలంటూ ఉద్యోగ సంఘాలు సమ్మె చేస్తున్నాయి. ఇక ఉద్యోగ సంఘాలు చేస్తున్న సమ్మె రోజు రోజుకు తీవ్రరూపం దాలుస్తోంది. ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు చేస్తున్న సమ్మెకు ఇటీవల టీఎస్ ఆర్టీసీ జేఏసీ సంఘాల నేతలు కూడా మద్దతు ప్రకటించారు అన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం సమ్మె చేస్తున్న ఉద్యోగ సంఘాలు చెబితే.. ఏ క్షణంలోనైనా ఆర్టీసీ బస్సులను ఆపేందుకు సిద్ధంగా ఉన్నామంటూ ప్రభుత్వానికి హెచ్చరికలు కూడా జారీ చేశారు.



 అయితే అటు ఉద్యోగులు చేస్తున్న సమ్మె రోజు రోజుకు తీవ్రరూపం దాలుస్తున్న ప్పటికీ ప్రభుత్వం మాత్రం ఇప్పటివరకు ఈ సమ్మె పై స్పందించిన దాఖలాలు లేవు. ఇలాంటి సమయంలో ఇటీవలే ఉద్యోగుల సమ్మెను సవాల్ చేస్తూ హైకోర్టులో పిల్ దాఖలు కావడం సంచలనంగా మారిపోయింది. విశాఖకు చెందిన రిటైర్డ్ ప్రొఫెసర్ సాంబశివరావు సమ్మెను తప్పుబడుతూ  హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఉద్యోగ సంఘాలు ఇచ్చిన సమ్మె నోటీసులు రాజ్యాంగ విరుద్ధం చట్టవిరుద్ధంగా ప్రకటించాలి అంటూ హైకోర్టును ఆశ్రయించారు సాంబశివరావు. ప్రభుత్వ ఉద్యోగులు సమ్మె చేయడం సర్వీసు నిబంధనలకు విరుద్ధం అంటూ సుప్రీంకోర్టు గతంలో తీర్పు ఇచ్చిందని దాఖలు చేసిన పిల్ లో ప్రస్తావించారు ఆయన.



 ఉద్యోగులు మొండిగా సమ్మెకు వెళితే సామాన్య ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సినా పరిస్థితులు ఏర్పడుతున్నాయని అదే సమయంలో కరోనా సమయంలో ఇలాంటి ఉద్యమాలు చేపడితే వైరస్ వ్యాప్తి మరింత పెరిగే అవకాశం కూడా ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇలాంటి పరిణామాల నేపథ్యంలోనే సమ్మె నోటీసును రాజ్యాంగ విరుద్ధంగా చట్టవిరుద్ధంగా ప్రకటిస్తూ ఉద్యోగులను సమ్మెకు వెళ్లకుండా ఆదేశాలు జారీ చేయాలంటూ హైకోర్టును కోరారు రిటైర్డ్  ప్రొఫెసర్ నాదెండ్ల సాంబశివరావు. ఇక ఈ పిల్ పై హైకోర్టు ఎలాంటి తీర్పు ఇవ్వబోతుంది అన్నది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: