మంత్రి కొడాలి నానిలో మూడు రోజుల నుండి బాగా మార్పు కనబడుతోంది. అంతకుముందు నొరిప్పితే చంద్రబాబునాయుడు, లోకేష్ పై దూకుడుగా విరుచుకుపడిపోయే కొడాలి ఇపుడు చాలా సంయమనం పాటిస్తున్నారు. మాట్లాడితే చాలా పరుషపదజాలంతో విరుచుకుపిపోయే కొడాలి మూడురోజులుగా చాలా ఓపిగ్గా ఎలాంటి దూకుడు (బూతు) లేకుండానే మాట్లాడుతున్నారు. మంత్రి నోరిప్పితే బూతులు తప్ప మరొకటి రాదని చెప్పే టీడీపీ నేతలు కొడాలికి బూతులమంత్రి అని ఎగతాళి చేస్తుంటారు.
నిజానికి కొడాలి ఎవరిపైన పడితే వాళ్ళపైన విరుచుకుపడిపోయే తత్వంకాదు. కేవలం చంద్రబాబు విషయంలో మాత్రమే పూనకం వచ్చినట్లు ఊగిపోతారు. జాతరలో తిట్టినట్లు తిడుతు చాకిరేవు మొదలు పెడతారు. వీలైనంత వరకు లోకేష్ గురించి అసలు పట్టించుకోనే పట్టించుకోరు. అప్పుడప్పుడు మాజీమంత్రి దేవినేని ఉమపైన కూడా నోటికొచ్చినట్లు మాట్లాడుతుంటారు. ఇక తమ్ముళ్ళు బోండా, వర్ల, బుద్దా లాంటి వాళ్ళను అసలు పట్టించుకోనే పట్టించుకోరు.
ఇక్కడ గమనించాల్సిందేమంటే టీడీపీలో కొందరు కావాలనే కొడాలిని గోకి వదిలిపెట్టేస్తారు. చిన్నగా గిల్లినా పెద్దగా రెచ్చిపోతారని తెలిసే తమ్ముళ్ళు కొడాలిని గట్టిగా గిచ్చుతున్నారు. దాంతో వ్యవహారమంతా కంపు కంపుగా తయారవుతోంది. మంత్రి మాట్లాడే బూతుల విషయంలో మీడియాకు కూడా ప్రధాన పాత్రే ఉంది. ఎందుకంటే కొడాలికి పూనకం వస్తే చంద్రబాబుపైన బూతులతో విరుచుకుపడతారని తెలిసి కావాలనే మంత్రిని కెలుకుతుంటారు.
సరే కారణాలు ఏవైనా మంత్రిని బాగా కెలికి మంత్రితో బూతులు తిట్టించుకోవటం కొందరు తమ్ముళ్ళకు బాగా అలవాటైంది. ఇదంతా తమ్ముళ్ళు ఎందుకు చేస్తున్నారంటే కొడాలితో పదే పదే బూతులు మాట్లాడించి జనాల్లో పలుచన చేయటానికే. అయితే గడచిన నాలుగు రోజులుగా మీడియా సమావేశాల్లో కొడాలి చాలా ఓపికగా మాట్లాడుతున్నారు. ఎక్కడా రెచ్చిపోయి బూతులు వినిపించటంలేదు. చాలా ఓపికగా పాయింట్ టు పాయింట్ మాత్రమే మాట్లాడుతున్నారు. బహుశా జగన్మోహన్ రెడ్డి నుండి ఏమైనా ఆదేశాలు వచ్చాయో లేకపోతే మంత్రికే విసుగనిపించిందో...మొత్తానికి సంయమనంతో ఉంటున్నారు అంతేచాలు.