జగన్మోహన్ రెడ్డి సత్తా ఏమిటో నాలుగు రోజుల్లో తేలిపోతుంది. కేంద్రప్రభుత్వం కావచ్చు లేదా బీజేపీ అగ్రనేతల దగ్గర జగన్ కున్న పలుకుబడికి ఫిబ్రవరి 3వ తేదీ పెద్ద పరీక్షగా తయారైంది. ఇంతకీ ఫిబ్రవరి 3వ తేదీ ఏమిటంటే లోక్ సభ ప్రివిలేజ్ కమిటి సమావేశం కాబోతోంది. ఇద్దరు ఎంపీలపై అనర్హత వేటు వేసే విషయం మీదే ప్రివిలేజ్ కమిటి ప్రత్యేకంగా సమావేశమవుతోంది. తృణమూల్ కాంగ్రెస్ తరపున గెలిచి బీజేపీలోకి ఫిరాయించిన శిశిర్ అధికారి, వైసీపీ తిరుగుబాటు ఎంపీ రఘురాజు విషయాన్ని తేల్చేందుకే కమిటి సమావేశమవుతోంది.




నిజానికి ఇద్దరు ఎంపీలపైన ఎప్పుడో అనర్హత వేటు పడుండాలి. కానీ మన దేశంలో ఏ వ్యవస్ధ కూడా దానిపని అది తిన్నగా చేయదుకదా. ప్రతిది రాజకీయాలతోనే ముడిపడుంటుంది. అందుకనే శిశిర్, రఘురాజు లాంటి వాళ్ళు హ్యపీగా ఉన్నారు. సరే శిశిర్ వ్యవహారం ఎలాగున్నా రఘురాజు పై మాత్రం వేటేపడకపోతే అది జగన్ ఇజ్జత్ కే సవాలుగా మారింది. ప్రతి విషయంలోను కేంద్రానికి సంపూర్ణమద్దతిస్తున్న జగన్ మాట తన ఎంపీపై అనర్హత వేటు విషయంలో చెల్లలేదంటే ఇక వేస్టనే చెప్పాలి.




అసలీ సమావేశం పెట్టించటానికే వైసీపీకి రెండేళ్ళుపట్టింది. సమావేశం పెడుతున్నదే జగన్ కెపాసిటి ఏమిటో తేల్చటానికన్నట్లుంది. ఎంపీపై అనర్హత వేటు వేయాలనే సిఫారసు ప్రివిలేజ్ కమటి స్పీకర్ కు  చేయకపోతే జగన్ కేంద్రానికి మద్దతుగా ఉండటంలో అర్ధమేలేదు. అందుకనే ఫిబ్రవరి 3వ తేదీ రఘురాజుకే కాదు జగన్ కు కూడా చాలా కీలకమే. ప్రివిలేజ్ కమిటి సమావేశంలో రఘురాజుపై అనర్హత నిర్ణయం తీసుకుంటేనే జగన్ పరువు నిలిచినట్లు. అలాకాకుండా అనర్హత వేటు అవసరం లేదని తేల్చినా లేకపోతే ఏ నిర్ణయము తీసుకోకపోయినా జగన్ ఫెయిలైనట్లుగానే భావించాలి. 




ఇపుడు కాకపోతే భవిష్యత్తులో రఘురాజుపై వేటు వేయటానికి అవకాశం రాకపోవచ్చు. వైసీపీ తరపున 28 మంది ఎంపీలు కేంద్రానికి మద్దతుగా ఉండి కూడా ఒక రాజకీయపరమైన నిర్ణయాన్ని కేంద్రం నుండి అనుకూలంగా తెప్పించుకోలేకపోయారంటే తిరుగుబాటు ఎంపీ రఘురాజు గ్రేట్ అనుకోవాల్సిందే.



మరింత సమాచారం తెలుసుకోండి: