సమతామూర్తి విగ్రహ ఆవిష్కరణలో పోలీసుల బందోబస్తుపై సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర సమీక్ష చేశారు.  ముచ్చింతల్ లోని జీవా ప్రాంగణంలో 7 వేల మంది పోలీసు సిబ్బందితో సమావేశం నిర్వహించారు సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర. ఈ సందర్భంగా జీయర్ స్వామి మాట్లాడారు. 5న ప్రధాని, 7న రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ , 8న అమిత్ షా,13న రాష్ట్రపతి వస్తారని చెప్పారు  జీయర్ స్వామి. వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్లు వారి సమయానుకూలంగా వస్తారని.. పోలీసులు, వాలంటీర్లు సమన్వయంతో కలిసి పనిచేసుకోవాలన్నారు జీయర్ స్వామి.  దేశ విదేశాల నుంచి లక్షల సంఖ్యలో భక్తులు ఇక్కడికి వస్తారని.. వచ్చే అతిథులు, భక్తులకు ఎలాంటి ఆటంకాలు లేకుండా పోలీసులు చూసుకోవాలని చెప్పారు జీయర్ స్వామి.  సమతామూర్తి ప్రాజెక్టుకు విరాళాలు ఇవ్వమని సామాన్యులను కోరామని.. సంపాదనలోనూ, ఖర్చులోనూ ఎంత ఎక్కువైతే అంత ఒక నెల ఇవ్వమని కోరామని వెల్లడించారు జీయర్ స్వామి.  

మొట్టమొదట స్పందించి నెల జీతం ఇచ్చింది ఏపీ పోలీసు అధికారి కోటేశ్వరరావు... పోలీసు శాఖలో అంకితాభావం, పట్టుదలతో ఉన్న వ్యక్తులు ఎంతో మంది ఉన్నారని.. ఒక పిల్లాడు తన తండ్రి ఇచ్చే పాకెట్ మనీ రూ.10లు రామానూజచార్యుల విగ్రహానికి విరాళం ఇచ్చాడని వెల్లడించారు జీయర్ స్వామి.  షికాగోలో ఒక చిన్నారి తన పిక్కీబ్యాగ్ నుంచి 5వేల డాలర్లు ఇచ్చిందని.. అలాగే కరీంనగర్ జిల్లాలోని ఒక మారుమూల గ్రామంలోని రైతుకూలీ రూ.10 వేలు ఇచ్చాడన్నారు జీయర్ స్వామి.  సమతామూర్తి విగ్రహా ఆవిష్కరణకు రైతు కూలీలు కూడా వస్తారు.. రైతు కూలీల శ్రమ కూడా సమతామూర్తి నిర్మాణంలో ఉంది. అలాంటి వారికి కూడా పోలీసుల సాయం ఇప్పుడు అవసరమని పేర్కొన్నారు జీయర్ స్వామి. ఇలాంటి చోట్ల పోలీసులు, వారి కుటుంబ సభ్యులే ఉంటారనే విమర్శలు వస్తుంటాయి.. ఇందుకు ఉదాహారణే సింహాచలం స్వామి చందనయాత్ర అన్నారు జీయర్ స్వామి.

మరింత సమాచారం తెలుసుకోండి:

bjp