విశాఖపట్నం జిల్లాలో తెలుగుదేశం పార్టీకి కంచుకోటలు ఎన్ని ఉన్నాయో చెప్పాల్సిన పని లేదు..జిల్లాలో 15 నియోజకవర్గాలు ఉంటే...సుమారు 10 స్థానాలు టీడీపీకి కంచుకోటలుగా ఉన్నాయని చెప్పొచ్చు. టీడీపీ పెట్టిన దగ్గర నుంచి ఆయా స్థానాల్లో మంచి విజయాలు సాధిస్తూనే వస్తుంది. అలా టీడీపీ మంచి విజయాలు సాధించే నియోజకవర్గాల్లో ఎలమంచిలి కూడా ఒకటి. 1983 నుంచి చూసుకుంటే ఎలమంచిలిలో టీడీపీ మొత్తం 6 సార్లు గెలిచింది...మధ్యలో రెండుసార్లు కాంగ్రెస్ గెలవగా, గత ఎన్నికల్లో వైసీపీ గెలిచింది. ఇక కాంగ్రెస్, వైసీపీ నుంచి గెలిచింది ఒకరే..కన్నబాబు రాజు కాంగ్రెస్ నుంచి రెండు సార్లు, వైసీపీ నుంచి ఒకసారి గెలిచారు.

ప్రస్తుతం ఎలమంచిలి ఎమ్మెల్యేగా కన్నబాబురాజు పనిచేస్తున్నారు...ఇక ఈ రెండున్నర ఏళ్ల కాలంలో కన్నబాబురాజు పనితీరు పట్ల ఎలమంచిలి ప్రజలు ఏమి సంతృప్తిగా లేరు...ఇంకా చెప్పాలంటే అసంతృప్తిగా ఉన్నారు. రెండున్నర ఏళ్లలో ఈయన చేసిన అభివృద్ధి శూన్యం..ఏదో పథకాలు వస్తున్నాయి తప్ప...అంతకుమించి ఎలమంచిలి ప్రజలకు ఒరిగింది ఏమి లేదు. దీంతో ఎలమంచిలిలో వైసీపీపై వ్యతిరేకత కొనసాగుతుంది.

అయితే ఈ వ్యతిరేకత టీడీపీకి ప్లస్‌గా మారిందా? అంటే అబ్బే పెద్దగా ప్లస్ అయినట్లే కనిపించడం లేదు..ఎందుకంటే ఇక్కడ టీడీపీకి నాయకత్వం ఇంకా స్ట్రాంగ్ అవ్వాలి. మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు వైసీపీ వైపు వెళ్ళాక, టీడీపీకి ప్రగడ నాగేశ్వరరావుని ఇంచార్జ్‌గా పెట్టారు. ప్రగడ నియోజకవర్గంలో యాక్టివ్‌గానే పనిచేస్తున్నారు..కాకపోతే అనుకున్న రీతిలో పార్టీని పికప్ చేయలేకపోతున్నారు.

అటు జనసేన తరుపున సుందరపు విజయ్ కుమార్ పనిచేస్తున్నారు...ఈయన బాగా దూకుడుగా ఉన్నారు..ఎలమంచిలిలో జనసేనని బలోపేతం చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. ఇక్కడ టీడీపీ-జనసేనలు కలిసి పనిచేస్తే కన్నబాబురాజుకు చెక్ పెట్టేయొచ్చు. అయితే రెండు పార్టీల మధ్య పొత్తు ఫిక్స్ అయితే..ఎలమంచిలి సీటు జనసేనకు అడిగే అవకాశాలు కూడా లేకపోలేదు. సుందరపు లాంటి బలమైన నాయకుడు ఉన్నారు కాబట్టి...ఈ సీటు జనసేన కోరే ఛాన్స్ ఉంది. మరి చూడాలి టీడీపీ కంచుకోట జనసేనకు దక్కుతుందో లేదో.  

మరింత సమాచారం తెలుసుకోండి: