తెలంగాణ వాకిట సంచలనం ఇప్పుడు దేశ వ్యాప్తంగా
అమలు చేసి చూపాలన్నది కేటీఆర్ సవాలు
సవాలక్ష పథకాల అమలులో ఉన్న తడబాటే దిద్దుకోలేని
కేంద్రం ఈ సవాలును స్వీకరిస్తుందా అన్నదే పెద్ద సందేహం
తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఇవాళ సంచలన వ్యాఖ్యలు చేశారు.దళితులంటే ప్రేమ ఉంటే దేశమంతటా దళిత బంధు పథకాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు.దీంతో ఇప్పుడీ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.కేసీఆర్ మాదిరిగానే దేశమంతా దళిత బంధు పథకాన్ని అమలు చేయాలని కోరారు. అంతేకాదు తమ బాటలోనే మిగిలిన వారంతా నడవాలని రాష్ట్రాలకూ సూచన చేయడం కూడా త్వరలోనే జరిగిపోనుందేమో! ఆ విధంగా కేటీఆర్ అందరి ముఖ్యమంత్రులకూ ఓ విధంగా సవాల్ విసిరిన విధంగానే భావించాలి. వాస్తవానికి ఎస్సీ కార్పొరేషన్ తరఫున ఉన్న నిధులనే ఇటుగా మళ్లించి వీళ్లంతా దళిత బంధు పేరిట విపరీతం అయిన ప్రచారం చేసుకుంటున్నారన్న ఆరోపణలూ ఉన్నాయి. బీసీ కార్పొరేషన్ నిధులను కులానికో కార్పొరేషన్ పేరిటజ జగన్ పంచిన విధంగానే కేసీఆర్ కూడా ఇలాంటి ఎత్తుగడే వేశారన్న ఆరోపణలూ ఉన్నాయి. మరి! వీటిపై ఎవరు సమాధానం చెబుతారో!
మరోవైపు దళిత బంధు పథకాన్ని ఎంత కష్టం అయినా రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తామని సీఎం కేసీఆర్ చెబుతున్నారు. ఇందుకోసం నిధులు కేటాయించడం,ఖర్చు చేయడం పెద్ద కష్టమేమీ కాదని కూడా తేల్చేశారు.ఇక ఈ పథకం అమలు బాధ్యత కూడా కలెక్టర్లకే అప్పగించారు కేసీఆర్. దీంతో నియోజకవర్గానికి ఓ వంద మంది లబ్ధిదారులను ఎంపిక చేసి ఒక్కొక్కరికీ పది లక్షల చొప్పున అందించేందుకు ఏర్పాటు చేశారు.వీటి సాయంతో వాళ్లు సొంతంగా యూనిట్లు పెట్టుకుని స్వయం ఉపాధి పొందవచ్చు అని కూడా కేసీఆర్ తెలిపారు. ఇదంతా హుజురాబాద్ ఎన్నికల సమయంలో నడిపిన వ్యవహారం.తరువాత కోడ్ వచ్చి ఆగిపోయింది.ఇప్పుడు ఈ పథకంకు సంబంధించి ఏం చేస్తారో అన్న క్లారిఫికేషన్ అయితే కేసీఆర్ నుంచి లేదు. కానీ ఎలా అయినా అమలు చేసి తీరుతామనే అంటున్నారు.