పెద్దపల్లి ఎంపీ నేతకాని వెంకటేష్ కామెంట్స్ చేశారు.  మతోన్మాద శక్తులు అయిన బీజేపీ ఎంపీ లు, నాయకులు కుక్కలులా అరుస్తున్నారని.. భారత రాజ్యాంగము ను బీజేపీ రాజ్యాంగం గా మారుస్తున్నారని మండిపడ్డారు పెద్దపల్లి ఎంపీ నేతకాని వెంకటేష్.  అంబేద్కర్ ను  అడ్డుపడ్డ చరిత్ర  ఈ బీజేపీ నాయకులుదని.. 1952 ఎన్నికల్లో అంబేద్కర్ పోటీ చేస్తే అడ్డుకుని పోటీ పెట్టిన చరిత్ర కాంగ్రెస్ దన్నారు పెద్దపల్లి ఎంపీ నేతకాని వెంకటేష్.
బీజేపీ ప్రభుత్వం దళితులు కి ఏమి చేసిందని.. బీజేపీ ఎంపీలు కు దమ్మున్న మగాళ్లు అయితే చర్చ కి రావాలన్నారు పెద్దపల్లి ఎంపీ నేతకాని వెంకటేష్అంబేద్కర్ ని అవమానపరిచిన  చరిత్ర బీజేపీ గాడిదలదని.. బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి రోజు ఆరుగురు మహిళలు అత్యాచారం కి గురి అవుతున్నారన్నారు పెద్దపల్లి ఎంపీ నేతకాని వెంకటేష్.  గోరఖ్ పూర్  బీజేపీ ఎంపీ రవి కిషన్ దళితులు గురించి చాలా దారుణంగా మాట్లాడాడు
దళితులు గురించి మాట్లాడితే నాలుక చీరెస్తామని హెచ్చరించారు పెద్దపల్లి ఎంపీ నేతకాని వెంకటేష్.

ఇక అటు  ముఛ్చింతల్ లో సమతామూర్తి శ్రీ రామానుజూచార్యుల సహస్రాబ్ది ఉత్సవాలలో పాల్గొన్న ప్రధాన మంత్రి నరేంద్ర మోడి పర్యటనను రాజకీయ కోణం లో చూడడం తగదని బిజెపి తెలంగాణ కోర్ కమిటీ సభ్యులు, మాజీ ఏమ్మెల్సీ , తమిళనాడు రాష్ట్ర పార్టీ జాతీయ కో ఇంఛార్జ్  పొంగులేటి సుధాకర్ రెడ్డి హితవు పలికారు.తెలంగాణ మంత్రుల వ్యాఖ్యలను ఆయన ఒక ప్రకటనలో తప్పుపట్టారు .   సాక్ష్యాత్ చిన్నజీయర్ స్వామి మోడి ని శ్రీ రాముడి  పాలనతో పోల్చారని ఇది భారతీయులందరు గర్వించదగిన విషయమన్నారు.దేశంలో విపక్ష ముఖ్యమంత్రులు ప్రధాని ప్రతిష్ట కు భంగం కలిగేలా మాట్లాడుతున్నారని ఆయన విమ్మర్శించారు..మోడి హయాంలోనే ప్రపంచ వ్యాపితంగా దేశ ప్రతిష్ట ఇనుమడించందన్నారు.ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని కూడా రాజకీయకోణంలో చూడటం ప్రతిపక్షాల దిగజారుడు సంస్కృతి కి నిదర్శనమని ఆయన దుయ్యబట్టారు.పవిత్ర కార్యక్రమాన్ని కి రాజకీయాలు ఆపాదించడం కాంగ్రెస్ , టిఆర్ఎస్  మంత్రి కేటిఆర్. ఇతర నాయకుల సంకుచిత మనస్తత్వం తీవ్ర గర్హనీయం అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: