మోడీ మరోఅసమాన విజయం అందుకుని
బీజేపీకి పండగ లాంటి వార్త
పండగ పూట వినిపించి సంబంధిత వర్గాలలో
ఆనందం నింపారు
బీజేపీ శ్రేణులకు శుభవార్త. ఇంకా చెప్పాలంటే అందరి వాడుగా నిలిచే మోడీ అభిమానులు అందరికీ శుభవార్త. దేశ రాజకీయాలను శాసించే శక్తిగానే కాదు ప్రపంచ స్థాయిలో ప్రభావితం చేయగల నేతగా మన దేశ ప్రధాని అరుదైన గుర్తింపు పొంది, అందరి దృష్టినీ మరోసారి ఆకర్షించారు.ప్రపంచంలోనే అత్యుత్తమ ప్రధానిగా వరుసగా మూడో సారి ఆయన నిలిచి సరికొత్త చరిత్ర సృష్టించారు. వరుసగా ప్రపంచ స్థాయి దిగ్గజ నేతలతో పోటీ పడి మరీ కొత్త రికార్డును నెలకొల్పారాయన.ఈ విషయమై మన దేశ ప్రధాని,అమెరికా ప్రధానిని సైతం వెనక్కునెట్టారు. అమెరికాకు చెందిన మార్నింగ్ కన్సల్ట్ అనే సంస్థ నిర్వహించిన సర్వేలో ఆసక్తిదాయకమైన ఫలితాలు వచ్చాయి.నివ్వెరపరిచే నిజాలు వెలుగు చూశాయి.
ముఖ్యంగా ప్రపంచ స్థాయిలో భారత్ ను ముందు వరుసలో నిలబెట్టేందుకు మోడీ చేస్తున్న కృషి కారణంగానే ఆయనకు ఈ అవార్డు వచ్చి ఉంటుందని బీజేపీ శ్రేణులు అంటున్నాయి. ఉగ్రవాద చర్యల నిలువరించడంలోనూ,కరోనా లాంటి మహమ్మారులు విజృంభిస్తున్నా కూడా దేశాన్ని ఆర్థిక పతనం దిశగా వెళ్లనీయకుండా జాగ్రత్త పడడం.రైతులకు చేయూత నిచ్చి వారికి ఆర్థిక సాయం చేయడం ఇలా ఎన్నో కార్యక్రమాల కారణంగానే ఆయన ఇవాళ ఉన్నత స్థానంలో ఉన్నారన్నది బీజేపీ మాట.
ఇక మోడీ తరువాత స్థానంలో మెక్సికో అధ్యక్షుడు లోపెజ్ ఓబ్రడార్ నిలిచారు.ఆయన తరువాత స్థానంలో ఇటలీ ప్రధాని మారియో ద్రాగ్చి నిలవగా, అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ మాత్రం ఆరు, బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ పదో స్థానానికే పరిమితం అయ్యారు. ప్రపంచ దేశాధినేతలను దాటి మోడీ ఇంతటి విజయం సాధించడం వెనుక ఆయన తీసుకుంటున్న నిర్ణయాలే కాకుండా పాలనా సంస్కరణలకూ ప్రాధాన్యం ఇస్తున్న కారణంగానే ఆయనకీ గుర్తింపు వచ్చిందని కమల నాథులు అంటున్నారు.