2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవగా, 2014, 2019 ఎన్నికల్లో వరుసగా వైసీపీ విజయం సాధించింది...మళ్ళీ పరిస్తితులు చూస్తుంటే వైసీపీ మూడో సారి గెలిచేలా ఉంది...వైసీపీ ఎమ్మెల్యే రక్షణనిధి స్ట్రాంగ్‌గా కనిపిస్తున్నారు. ఇంతకాలం ఇక్కడ టీడీపీకి సరైన నాయకత్వం లేకపోవడం వల్ల...తిరువూరులో వైసీపీకి ఎదురే లేదన్నట్లు పరిస్తితి నడిచింది..కానీ ఈ మధ్య తిరువూరు రాజకీయం మారుతుంది..వైసీపీకి చెక్ పెట్టడానికి టీడీపీ సరికొత్త ప్లాన్స్‌తో ముందుకొస్తుంది.
ఇప్పటికే తిరువూరులో కొత్త ఇంచార్జ్‌ని తీసుకొచ్చి పెట్టారు...శావల దేవదత్‌ని ఆ మధ్య ఇంచార్జ్‌గా నియమించారు. అయితే ఇంచార్జ్‌గా వచ్చిన వెంటనే దేవదత్ దూకుడుగా రాజకీయం చేయడం మొదలుపెట్టారు...నియోజకవర్గంలో ప్రతి గ్రామం తిరిగేస్తున్నారు...ప్రజా సమస్యలని తెలుసుకుంటున్నారు...అలాగే పాత టీడీపీ క్యాడర్‌ని మళ్ళీ యాక్టివ్ చేస్తున్నారు. ఇక ఎక్కడకక్కడ టీడీపీ కార్యాలయాలని ఏర్పాటు చేస్తూ..కార్యకర్తలని కలుపుకునిపోతున్నారు.
అటు విజయవాడ ఎంపీ కేశినేని నాని సైతం...తిరువూరుపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు...విజయవాడ పార్లమెంట్ పరిధిలో ఉన్న మిగిలిన అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ పరిస్తితి బాగానే ఉంది గాని..తిరువూరులోనే పార్టీ పరిస్తితి అంత బాగోలేదు. దీంతో కేశినేని సైతం ఇంచార్జ్ దేవదత్‌తో కలిసి తిరువూరులో తిరుగుతున్నారు..నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. దేవదత్ ఆర్ధికంగా కూడా బలంగా ఉండటంతో తిరువూరులో పార్టీకి మరింత అడ్వాంటేజ్ అవుతుంది. మరి చూడాలి వైసీపీ కంచుకోటగా ఉన్న తిరువూరుని టీడీపీ సొంతం చేసుకుంటుందో లేదో?