కానీ ఇప్పటివరకు కూడా సత్తెనపల్లి సీటుని ఎవరికి కేటాయించలేదు..పైగా ఈ సీటు కోసం పోటీ ఎక్కువ ఉంది..గత ఎన్నికల నుంచే సీటు దక్కించుకోవాలని మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు తనయుడు..రాయపాటి రంగారావు ట్రై చేస్తున్న విషయం తెలిసిందే...అయితే రాయపాటి ఫ్యామిలీకి నరసారావుపేట ఎంపీ సీటు ఉంది కాబట్టి సత్తెనపల్లి సీటు కేటాయించే అవకాశాలు లేవని తెలుస్తోంది.
ఇదే సమయంలో మాజీ ఎమ్మెల్యే వైవీ ఆంజనేయులు సైతం..సత్తెనపల్లి సీటు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు...కానీ ఆయన నాన్ లోకల్ కావడంతో సీటు ఇచ్చే విషయంలో ఇబ్బందులు ఉన్నాయి. అటు సత్తెనపల్లికి చెందిన మాజీ ఎంపీపీ నాగోతు శౌరయ్య సైతం ట్రై చేస్తున్నారని తెలిసింది. కానీ ఎవరికి సత్తెనపల్లి సీటు ఇవ్వలేదు...అయితే సత్తెనపల్లి సీటు కోడెల శివరాంకే ఖరారు చేయాలని చంద్రబాబు చూస్తున్నారట.
కాకపోతే సత్తెనపల్లిలో కోడెల తనయుడు వ్యతిరేక వర్గం మాత్రం ఒప్పుకోవడం లేదు..ఇక ఆ వర్గాన్ని దగ్గర చేసుకునేందుకు శివరాం ప్రయత్నాలు చేస్తున్నారట. కొందరు నేతలు శివరాంకు దగ్గర అయ్యారని తెలుస్తోంది...కానీ ఇంకా కొందరు దగ్గర కావాల్సి ఉంది..అయితే పూర్తి స్థాయిలో వ్యతిరేక వర్గాన్ని దగ్గర చేసుకుంటే శివరాంకే సీటు ఫిక్స్ చేయాలని బాబు భావిస్తున్నారట. అంటే సత్తెనపల్లి సీటు దాదాపు శివరాంకే దక్కుతుందని తెలుస్తోంది....ఇందులో ఎలాంటి డౌట్ లేదని చెప్పొచ్చు.