ఏపీ రాజకీయాల్లో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ పార్టీలు శత్రువులు మాదిరిగా తలపడుతున్న విషయం తెలిసిందే...కేవలం రాజకీయ పరంగానే కాకుండా వ్యక్తిగతంగా కూడా శత్రువులు మాదిరిగా తయారయ్యి రాజకీయం చేస్తున్నారు. అసలు వైసీపీ కార్యకర్తలు, టీడీపీ కార్యకర్తలు ఒకరిపై ఒకరు దారుణమైన విమర్శలు చేసుకుంటూ ముందుకెళుతున్నారు. సోషల్ మీడియా వేదికగా ఈ రెండు పార్టీల కార్యకర్తలు ఓ రేంజ్‌లో పోస్టులు పెడుతూ...విమర్శలు చేసుకుంటున్నారు.

ఇక తాజాగా ఏపీలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై కూడా రెండు పార్టీల కార్యకర్తల మధ్య వార్ నడుస్తోంది...ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీకి సంబంధించి రెండు పార్టీల మధ్య వాదోపవాదాలు సాగుతున్నాయి. ఇటీవల చిరంజీవితో పాటు ప్రభాస్, మహేష్, రాజమౌళిలు జగన్‌ని కలిసి సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన సమస్యలపై మాట్లాడి...జగన్‌కు థాంక్స్ చెప్పి, ఆయనని పొగడ్తలతో ముంచెత్తారు. ఇక బడా హీరోలే తమ అధినేత దగ్గరకు వచ్చారని, అలాగే పొగిడారని చెప్పి వైసీపీ ఫ్యాన్స్ సంతోష పడిపోతున్నారు.

ఇంకా ఆ హీరోల మద్ధతు కూడా జగన్‌కే ఉంటుందని, హీరోలు జగన్‌కు సపోర్ట్ చేయడం చూసి టీడీపీ వాళ్ళు, చంద్రబాబు కుళ్లి కుళ్లి ఏడుస్తున్నారని వైసీపీ శ్రేణులు పోస్టులు పెడుతున్నాయి. ఇక దీనికి తెలుగు తమ్ముళ్ళు కూడా గట్టిగానే కౌంటర్లు ఇస్తున్నారు..సినీ ఇండస్ట్రీని ముంచిది ఎవరో అందరికీ బాగా తెలుసని, హీరోలు కూడా ఏదో మొక్కుబడిగానే జగన్‌కు థాంక్స్ చెప్పారని, వారిని ఇబ్బందులు పెట్టింది ఎవరో తెలుసని అంటున్నారు. ఏదో హీరోలు వస్తే వారి ఫ్యాన్స్ కూడా సపోర్ట్ ఇస్తారని అనుకోవడం వైసీపీ అవివేకమే అవుతుందని అంటున్నారు.

అదే సమయంలో వీరి మధ్య ప్రత్యేక హోదాపై కూడా రచ్చ నడుస్తోంది...హోదా రాకపోవడానికి చంద్రబాబు కారణమని వైసీపీ శ్రేణులు మాట్లాడుతున్నాయి..అసలు హోదాపై వైసీపీ పెయిడ్ ఆర్టిస్టులు గత ఎన్నికల ముందు ఎంత డ్రామా ఆడారో ప్రజలకు ఇప్పుడు అర్ధమవుతుందని చెప్పి, గత ఎన్నికల ముందు హోదా కోసం హడావిడి చేసిన వైసీపీ శ్రేణుల వీడియోలని తమ్ముళ్ళు  సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: