దేశ రాజకీయాల్లో పెద్దగా ప్రాంతీయ పార్టీల నాయకులు రాణించిన దాఖలాలు లేవు. గడిచిన ఏడేళ్లలో మోడీ ఒక్కరే ఆ విధంగా గుజరాత్ నుంచి పోయి రాణించారు. గడిచిన ఏడేళ్లలో చంద్రబాబు ఆ విధంగా రాణించేందుకు ప్రయత్నించి విఫలం అయ్యారు. ఆఖరి నిమిషంలో బీజేపీ తో గత ఎన్నికల్లో కటీఫ్ పెట్టుకుని పెద్ద తప్పిదమే చేశారు.దీనిపై అప్పట్లో చాలా విమర్శలు వచ్చాయి.దేశ రాజకీయాల్లో వైఎస్ జగన్ కూడా రాణించలేకపోయారు. కవిత కూడా పెద్దగా ప్రభావితం చేయలేకపోయారు. ఆ మాటకు వస్తే
ఎన్టీఆర్ మినహా పెద్దగా ఎవ్వరూ అంతగా ముందుకుపోలేకపోయారు.నేషనల్ ఫ్రంట్ పేరిట కాస్తో కూస్తో ఆయన రాణించేందుకు చేసిన వ్యూహాలు ఫలితం ఇచ్చాయనే చెప్పాలి.ఆ రోజు ఉన్న విధంగా ఈ రోజు రాజకీయాలు లేవు కనుక ఇప్పటికిప్పుడు కేసీఆర్ రాణించడం అన్నది జరగని పని.
ఇక తమిళనాడు రాజకీయాలలో కూడా పెద్దగా జాతీయ స్థాయికి ఎదిగినవారెవ్వరూ లేరు.కరుణానిధి వారసులు రాణించేందుకు ప్రయత్నించినా ఆఖరులో యూపీఏ హయాంలో 2జీ స్పెక్ట్రమ్ స్కాంలో ఇరుక్కుపోయారు.కరుణానిధి అనేకాదు జయలతిత కూడా పెద్దగా సాధించిందేమీ లేదు. కానీ కేంద్రం మెడలు వంచి నిధులు సాధించిన ధీరగుణం అయితే ఆమె పుష్కలంగానే ఉంది.ప్రాంతీయం నుంచి చిదంబరం ఆర్థికవేత్తగా రాణించారు కానీ ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లో జనాకర్షణ నేతగా మాత్రం పేరు తెచ్చుకోలేకపోయారు.వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుంటే కేసీఆర్ కూడా కనీసం ఇప్పటిదాకా ఉన్న దక్షిణాది నాయకులను దాటుకుని వీరి స్థాయిలో రాణించేందుకు అవకాశాలు ఏమీ లేని నేతగా చరిత్రలో మిగిలిపోవడం ఖాయం.