ఫిబ్రవరి 14 గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇది ప్రేమికుల దినోత్సవం. ప్రపంచ వ్యాప్తంగా ప్రేమికులు పండుగ జరుపుకునే రోజు. భారత్ లోని ఆ ప్రాంతం లవర్స్ ప్యారడైజ్. ప్రస్తుతం అక్కడ ప్రేమయుద్దం జరుగుతోంది. ఆ ప్రాంతం ఎక్కడుందో, అసలు అక్కడ జరుగుతున్న యుద్దం ఏమిటో తెెలుసుకోవాలనుందా మీకుగోవా... ప్రేమికులకు భారత్ లో ఉన్న స్వర్గధామం. ప్రస్తుతం అక్కడ ప్రేమికుల సందడి కనిపించడం లేదు. దాని స్థానంలో పోలీసుల హడావిడి, రాజకీయ వేడి ఎక్కువగా ఉంది. దీనికి కారణం ఏమిటో తెలుసా ? ఉత్తర భారతాన ఐదు రాష్ట్రాలకు జురుగుతున్న ఎన్నికలలో భాగంగా ఫిబ్రవరి 14న గోవా రాష్ట్రంలో శాసన సభకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఆ రాష్ట్ర శాసన సభలో 40 స్థానాలకు ప్రస్తుతం ఎన్నిక జరుగుతోంది. కడపటి వార్తలు అందే సరికి రాష్ట్రంలో 35 శాతం పై చిలుగు పోలింగ్ నమోదైంది. ఈ సాయంత్రం ఆరు గంటల వరకు అక్కడ పోలింగ్ జరగనుంది. రాజకీయ యువనికపై గోవాకు ప్రత్యేకస్థానం ఉంది. ప్రస్తుతం అక్కడ అధికార పీఠాన్ని దక్కించుకునేందుకు అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ తో పాటు, తృణముల్ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) లు పోటీ పడుతున్నాయి. గతంలో ఈ రాష్ట్రంలో ద్విముఖ పోటీ జరిగేది, ఈ దఫా నాలుగు పార్టీలో తమ శక్తియుక్తులను ఉపయోగించి బరిలో దిగాయి. ప్రతి పార్టీ కూడా సహజం గానే తామే గెలుస్తామని పేర్కోంటోంది. ఇప్పటి వరకూ అధికారాన్ని వెలగబెట్టిన భారతీయ జనతా పార్టీకి ఇది అగ్ని పరీక్ష. ఎందుకంటే ఆ రాష్ట్రంలో బిజేపి తొలిసారిగా మాజీ కేంద్ర మంత్రి మనోహర్పారికర్ లేకుండా ఎన్నికలకు వెళుతోంది. ఇప్పటి వరకూ జరిగిన అన్ని ఎన్నికల్లోనూ మాజీ ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ నేతృత్వంలోనే ఎన్నికల బరిలో దిగి విజయబావుటాలను ఎగుర వేసింది. ఈ దఫా ఆయన లేకుండా ఎన్నికలను ఎదుర్కోంటోంది. ఇది ఒక విధంగా ఆ పార్టీకి అగ్నిపరీక్ష. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే. మనోహర్ పారికర్ కుమారుడు ఉత్పల్ పారికర్ ఈ దఫా స్వతంత్ర అభ్యర్థిగా తన తండ్రి స్థానం పనాజీ నియోజక వర్గం నుంచి బరిలో ఉన్నారు. తన తండ్రి దివంగత మనోహర్ పారికర్ గోవా రాష్ట్రాభీవృద్ధికి చేసిన సేవలను చూసి తనను ఆశీర్వదించాలని ఆయన ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. దీంతో దేశ వ్యాప్తంగా రాజకీయ పరిశీలకుల చూపు గోవా పైన, అక్కడ జరుగుతున్న ప్రేమ యుద్ధం పైన పడిందనడంలో ఎలాంటి సందేహం లేదు.