తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు మంచి హిట్ మీద ఉన్నాయి. ఒకరోజు తెరాస వర్సెస్ బీజేపీ మరియు మరో రోజు తెరాస వర్సెస్ కాంగ్రెస్ లు పరస్పరం విమర్శలు చేసుకుంటూ హాట్ టాపిక్ గా మారుతున్నారు. అయితే తాజాగా తెరాస ఎమ్మెల్సీ కవితపై తెలంగాణ పిసిసి అధ్యక్షుడు మరియు తెలంగాణ ఫైర్ బ్రాండ్ గా పేరున్న రేవంత్ రెడ్డి పై రేంజ్ లో విరుచుకు పడ్డారు. కేసీఆర్ సుపుత్రిక అయిన కవితను ఉద్దేశిస్తూ కేసీఆర్ పై ఫైర్ అయ్యారు. కేసీఆర్ ది మొసలి కన్నీరు అంటూ హేళన చేసి మాట్లాడారు. ఇలా చేయడం నాయకత్వానికి నిదర్శనం కాదు అని తన స్టైల్ లో జవాబు ఇచ్చాడు రేవంత్ రెడ్డి. అయితే ఇదంతా కూడా మోదీ నుండి వచ్చిందని అర్థమవుతోంది.

నరేంద్ర మోదీ తెలంగాణ నేలను తక్కువ చేసి మాట్లాడుతున్నప్పుడు ఏమయ్యాడు మీ నాయకుడు అంటూ కవితను ప్రశ్నించాడు. మరియు ప్రత్యేక తెలంగాణ కోసం ప్రాణాన్ని సైతం త్యాగం చేసిన అమరవీరుల గురించి మోదీ  అవమానించారు, ఆ రోజు ఏమయ్యాడు మీ కేసీఆర్ అంటూ ద్వజమెత్తారు. ఇలా పలు కీలక సమయాలలో ప్రశ్నించాల్సిన తెలంగాణ సీఎం కేసీఆర్ నోరు మెదపకుండా, తనకు రాజకీయంగా మేలు చేసుకోవడం కోసం మాత్రమే ఇలాంటి నాటకాలు నడుపుతాడు అని కౌంటర్ ఇచ్చాడు. ఈ మాటలు అన్నీ కూడా నావి కాదని తెలంగాణ ప్రజల తరపున నేను ప్రశ్నిస్తున్నాను అంటూ రేవంత్ రెడ్డి మాట్లాడారు.  

అయితే రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు ముందు రోజు అంటే నిన్న కవిత చేసిన ఒక ట్వీట్ కారణంగానే ఇప్పుడు రేవంత్ రెడ్డి బదులిచ్చాడు. కవిత నిన్న ట్విట్టర్ వేదికగా మాట్లాడుతూ బీజేపీ నాయకులు కాంగ్రెస్ పై విమర్శలు చేస్తుంటే కేసీఆర్ మీకు మద్దతుగా మాట్లాడారని ఈ విషయాన్ని కాంగ్రెస్ నాయకులు అందరూ గుర్తు పెట్టుకోవాలి అని కవిత చెప్పారు. ఇందుకు ప్రతిగా రేవంత్ రెడ్డి ట్వీట్ చేశాడు. ఇప్పుడు ఇది సంచలనంగా మారింది. దీనిపై తెరాస నేతలు ఏ విధంగా  స్పందిస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: