హిజాబ్ వివాదంపై బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తాజ్వాల స్పందించారు. హిజాబ్ ధరించిన బాలికలను పాఠశాల గేట్ల దగ్గర అవమానించడం మానేయండని సూచించారు. అక్కడికి వారు తమను తాము శక్తివంతం చేసుకోవడానికి వచ్చారన్నారు. పాఠశాల వారి సురక్షిత స్వర్గంగా భావించబడుతుందని అభిప్రాయపడ్డారు. ఈ నీచ రాజకీయాల నుంచి వారిని తప్పించాలని కోరారు. చిన్న మనసులను మచ్చపెట్టడం ఆపాలన్నారు. పసి హృదయాల్లో భయాన్ని నింపొద్దు అని ఆమె సోషల్ మీడియా ద్వారా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

అయితే కర్ణాటకలో హిజాబ్ వివాదంతో మూతబడిన విద్యాసంస్థలు గత సోమవారం తెరుచుకున్నాయి. పలు చోట్ల విద్యార్థినులు హిజాబ్ ధరించి రాగా యాజమాన్యం అడ్డుకుంది. వాటిని తీసిన తర్వాతే లోపలికి పంపించారు. ముస్లిం టీచర్లకూ ఇదే రూల్ అమలు చేశారు. కొన్ని చోట్ల విద్యార్థుల తల్లిదండ్రులు, స్కూల్ యాజమాన్యాలకు మధ్య వాగ్వాదం జరిగింది. ముందు జాగ్రత్తగా పలు చోట్ల 144సెక్షన్ విధించారు.

కర్ణాటకలో హిజాబ్ తీసేస్తేనే ముస్లిం విద్యార్థినులను స్కూళ్లలోకి అనుమతిస్తున్నారు. 10వ తరగతి ప్రిపరేటరీ పరీక్షలు ఉన్నాయనీ.. తమను అనుమతించాలని శివమొగ్గలో స్టూడెంట్స్ డిమాండ్ చేశారు. హిజాబ్ లేకుండా ప్రత్యేక గదిలో ఎగ్జామ్స్ రాయాలని ఉపాధ్యాయులు సూచించారు. దీన్ని వ్యతిరేకిస్తూ 13మంది పరీక్షలను బహిష్కరించారు. హిజాబ్ లేకుండా తమ పిల్లలను స్కూళ్లకు పంపించలేమని తల్లిదండ్రులు వారిని ఇంటికి తీసుకెళ్లారు.

ఇక ఇస్లాంలో హిజాబ్ ముఖ్యమైన భాగం కాదని కేరళ గవర్నర్ అరిఫ్ మహ్మద్ ఖాన్ అన్నారు. ఖురాన్ లో హిజాబ్ గురించి ఏడు సార్లు ప్రస్తావన ఉందని తెలిపారు. అయితే అది మహిళల డ్రెస్ కోడ్ తో సంబంధం లేదని చెప్పారు ఇది ముస్లిం బాలికలు అభివృద్ధి చెందకుండా చేసే కుట్ర అని ఆయన తెలిపారు. విద్యార్థులు తరగతి గదులకు తిరిగి వెళ్లి చదువును కొనసాగించాలని సూచించారు. సిక్కు మతంలో తలపాగా మాత్రం ముఖ్యమైన భాగమని చెప్పుకొచ్చారు.




 


మరింత సమాచారం తెలుసుకోండి: