ఈ క్రమంలోనే బీజేపీపై యుద్ధం ప్రకటించిన కేసీఆర్ సైతం..మమతా ఏర్పాటు చేసే ఫ్రంట్‌లో కీలకంగా పనిచేయడానికి సిద్ధమయ్యారు. ఇప్పటికే మమతా బెనర్జీ, కేసీఆర్, ఉద్ధవ్ ఠాక్రే, స్టాలిన్, అరవింద్ కేజ్రీవాల్, హేమంత్ సొరేన్, తేజస్వి యాదవ్ లాంటి వారు నేషనల్ ఫ్రంట్ ఏర్పాటు చేసి బీజేపీకి చెక్ పెట్టేయాలని చూస్తున్నారు. అయితే ఈ ఫ్రంట్‌లోకి కాంగ్రెస్, కమ్యూనిస్టులు వచ్చేందుకు ఆసక్తి చూపడం లేదు.
ఇక ఈ ఫ్రంట్‌లోకి న్యూట్రల్‌గా ఉండే నాయకులని సైతం తీసుకురావడానికి కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్నారు..ఇప్పటికే ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్‌ని నేషనల్ ఫ్రంట్‌లోకి తీసుకోచ్చేందుకు చూస్తున్నారని తెలుస్తోంది. ఇదే క్రమంలో ఏపీకి చెందిన టీడీపీ అధినేత చంద్రబాబు, వైసీపీ అధినేత జగన్‌లు...నేషనల్ ఫ్రంట్‌లోకి వస్తారా? లేదా? అనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. మామూలుగా జగన్‌కు కేసీఆర్‌తో మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి...అదే సమయంలో కేంద్రంలోని బీజేపీతో కూడా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి...అలాంటప్పుడు జగన్, కేసీఆర్‌కు మద్ధతుగా వెళ్తారా? లేక అలాగే సైలెంట్‌గా ఉండిపోతారా? అనేది చూడాలి.
ఇటు చంద్రబాబు పరిస్తితి ఏంటి అనేది క్లారిటీ లేదు...కేసీఆర్ ఎలాగో బాబుతో మాట్లాడే పరిస్తితి లేదు. కానీ స్టాలిన్, మమతా, కేజ్రీవాల్ లాంటి వారితో బాబుకు మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అలాంటప్పుడు వారు మాట్లాడితే బాబు నేషనల్ ఫ్రంట్‌లోకి వస్తారా? లేక బీజేపీతో పెట్టుకుంటే మళ్ళీ ఇబ్బంది అవుతుందని సైలెంట్‌గా ఉండిపోతారా? అనేది చూడాలి. మరి చూడాలి బాబు-జగన్‌లు ఏ ఫ్రంట్‌లోకి వెళ్తారో?