కృష్ణా జిల్లా రాజకీయాల్లో బలమైన నాయకుల్లో కొడాలి నాని, వల్లభనేని వంశీలు ముందు వరుసలో ఉంటారని చెప్పొచ్చు...రాజకీయంగా రాష్ట్ర స్థాయిలో మంచి ఫాలోయింగ్ ఉన్న నాయకులు వీరు..అలాగే వారి వారి నియోజకవర్గాల్లో తిరుగులేని నాయకులుగా ఉన్నారు....అసలు రాజకీయంగా వీరికి చెక్ పెట్టడం కూడా చాలా కష్టమనే చెప్పొచ్చు. అయితే ఈ ఇద్దరు నేతలు టీడీపీలో రాజకీయ జీవితం మొదలుపెట్టి, ఆ పార్టీలో బలమైన నేతలుగా ఎదిగి, వైసీపీలోకి వెళ్ళిన విషయం తెలిసిందే.

ఇలా బలమైన నేతలు వైసీపీలోకి వెళ్ళడంతో...వీరు ప్రాతినిధ్యం వహించే గుడివాడ, గన్నవరం నియోజకవర్గాల్లో టీడీపీకి సరైన ప్రాతినిధ్యం లేకుండా పోయింది...ఆ రెండు చోట్ల టీడీపీకి బలమైన నాయకులు లేకుండా పోయారు. గుడివాడలో నాయకులని మారుస్తూ వచ్చారు గాని పెద్దగా ప్రయోజనం లేకుండా పోయింది. అయితే ఇప్పుడు గుడివాడలో టీడీపీ బాధ్యతలు రావి వెంకటేశ్వరరావు చూసుకుంటున్న విషయం తెలిసిందే....కానీ ఈయన అంత దూకుడుగా పనిచేయడం లేదు...దీంతో గుడివాడలో టీడీపీ పరిస్తితి దారుణంగానే ఉంది.

ఇంకా చెప్పాలంటే రాజకీయంగా కొడాలి బలంతో పోలిస్తే రావి బలం చాలా తక్కువగా ఉందని చెప్పొచ్చు...అంటే కొడాలి బలం ముందు రావి సరిపోవడం లేదు..అందుకే ఇక్కడ టీడీపీకి బలమైన నాయకుడుని పెట్టాలని డిమాండ్ పెరుగుతుంది. ఇప్పటికే ఇక్కడ బాలయ్య పోటీ చేస్తారని, లేదా నందమూరి ఫ్యామిలీ నుంచి సుహాసిని పోటీ చేస్తారని, అలాగే వంగవీటి రాధా గుడివాడలో పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతుంది. కానీ వీరెవరు గుడివాడలో పోటీ చేసే అవకాశాలు కనిపించడం లేదు. కాకపోతే గుడివాడలో కొడాలికి బలమైన ప్రత్యర్ధి ఉండాలి.

అటు గన్నవరంలో కూడా వంశీకి పోటీగా బలమైన ప్రత్యర్ధి లేరు..వంశీ వైసీపీ వైపు వెళ్ళాక బచ్చుల అర్జునుడుని ఇంచార్జ్‌గా పెట్టారు...ఈయనకు నియోజకవర్గంపై పెద్దగా పట్టు లేదు...అలాగే నియోజకవర్గంలో దూకుడుగా పనిచేయట్లేదు. దీంతో గన్నవరంలో బలమైన నేత కోసం టీడీపీ శ్రేణులు ఎదురుచూస్తున్నాయి. మరి చూడాలి గుడివాడ, గన్నవరంలో ప్రత్యర్ధులు మారుతారో...లేక పాతవాళ్లే కంటిన్యూ అవుతారో.


మరింత సమాచారం తెలుసుకోండి: