ఇద్ద‌రు ముఖ్య‌మంత్రులు
రెండు ఉప ప్రాంతీయ పార్టీలు
తెలంగాణ రాష్ట్ర స‌మితిని వ‌దిలి
కొత్త పార్టీ ఆరంభించే కేసీఆర్
ఎప్ప‌టి నుంచో త‌న మ‌న‌సులో ఉన్న మాట‌ను
బ‌య‌ట‌పెట్టారు..
ఇదే క్ర‌మంలో ఆంధ్రాకు జ‌రిగిన అన్యాయంపై
కేసీఆర్ క‌విత హ‌రీశ్ కేటీఆర్ గొంతు వినిపిస్తున్నారు
ఇవ‌న్నీ  మంచి ప‌రిణామాలే.. రాజకీయ దృక్ప‌థం ఎలా ఉన్నా
మ‌న త‌ర‌ఫున గొంతుక వినిపిస్తున్న తెలంగాణ చంద్రుడితో
జ‌గ‌న్ ఇవాళ ఎంతో స‌ఖ్య‌త‌తో ఉన్నారు..ఇరు ప్రాంతాల మ‌ధ్య
స్నేహ సంబంధాల సుదృఢ చిత్తానికి ఇదెంతో అవ‌స‌రం


ఇవాళ తెలంగాణ చంద్రుడు కేసీఆర్ పుట్టిన్రోజు.ఆయ‌న‌కు జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు.ఇదే సంద‌ర్భంలో ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్  రెడ్డికి, తెలంగాణ సీఎం కేసీఆర్ కు ఉన్న అనుబంధం గురించి మాట్లాడాలి.ముఖ్యంగా రాజశేఖ‌ర్రెడ్డి మ‌ర‌ణానంత‌రం కేసీఆర్ కుటుంబం జ‌గ‌న్ కు ఎంతో అండ‌గా నిలిచింది.ఆయ‌న‌ను క‌ష్ట‌కాలంలో కేసీఆర్ ఓ అన్న‌య్య మాదిరి ఆదుకున్నారు.ముఖ్యంగా ప్రాంతాల మ‌ధ్య వేర్పాటు అయి, ఎవ‌రి దారి వారిదే అని ఉన్న త‌రుణంలోనూ కేసీఆర్ ఆయ‌న‌కు అండ‌గానే ఉన్నారు.ఇవాళ ఇరు తెలుగు రాష్ట్రాల‌కూ పెద్ద‌న్న‌గా  ఉన్నారు కేసీఆర్. ఉద్య‌మ కాలంలో కొంత అస్త‌వ్య‌స్తత రెండు ప్రాంతాల్లో ఉన్న‌ప్ప‌టికీ ఇప్ప‌టి ప‌రిణామాలు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి.ముఖ్యంగా  ఆంధ్రా అభివృద్ధికి తాను సాయం చేస్తాన‌నే అంటున్నారు కేసీఆర్. కృష్ణా జలాల వినియోగానికి సంబంధించి కూడా ఆయ‌న ఓ స్ప‌ష్ట‌మ‌యిన కార్యాచ‌ర‌ణ రూపొందించాల‌ని ఎప్ప‌టి నుంచో నిపుణుల‌ను కోరుతున్నారు కూడా!

ముఖ్యంగా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ని వీడి సొంతంగా పార్టీ పెట్టుకున్నప్పుడు జ‌గ‌న్, కొంత గంద‌ర‌గోళంలోనే ఉన్నారు.అప్ప‌టి ప‌రిణామాల ప్ర‌కారం ఎవ‌రు ఎటు పోతున్న‌ది తెలియ‌ని సందిగ్ధ‌త.అలాంటి దారుల నుంచి స‌వ్య‌మ‌యిన దారుల్లోకి వ‌చ్చిన జ‌గ‌న్ ఇవాళ సీఎంగా రాణిస్తున్నారు.కేసీఆర్ కూడా విభ‌జ‌న చ‌ట్టం  అమ‌లుపై కేంద్రంతో పోరాడేందుకు త‌న‌తో క‌లిసి రావాల‌ని సీఎం జ‌గ‌న్ కు ఎన్నో సార్లు చెప్పారు.ఆయ‌నే కాదు ఆయ‌న గారాల‌ప‌ట్టి క‌విత కూడా ఓ సంద‌ర్భంలో పార్ల‌మెంట్ వేదిక‌గా విభ‌జ‌న చ‌ట్టంపై  మాట్లాడి, అదేవిధంగా ఆంధ్రాకు మ‌ద్ద‌తు ఇచ్చి జై ఆంధ్ర అని నినాదం ఇచ్చారు కూడా! ఇవాళ ఇరు పార్టీలూ మంచి స‌ఖ్య‌త‌తోనే ఉన్నాయి. సైద్ధాంతిక విభేదాలు అటుంచి ఆలోచిస్తే ఇవాళ కేసీఆర్ కేంద్రంతో పోరుకు సిద్ధం అవుతున్నారు.అయినా కూడా ఎక్క‌డా త‌గ్గ‌డం లేదు.ఆ రోజు సోనియాపై జ‌గ‌న్ తిరుగుబాటు చేసిన విధంగానే ఇవాళ ప్ర‌ధాని న‌రేంద్ర మోడీపై కేసీఆర్ పోరాటం చేస్తున్నారు.ఈ పోరులో ఆయ‌న నెగ్గినా నెగ్గ‌క‌పోయినా అచంచ‌ల విశ్వాసంతో చేసే ప్ర‌య‌త్న‌మే అన్నింటి క‌న్నా గొప్ప‌ది అని ఇవాళ సంబంధిత వ‌ర్గాల స్ప‌ష్టమ‌యిన అభిప్రాయం.


మరింత సమాచారం తెలుసుకోండి:

trs