ఏపీలో ప్రధానంగా అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీల మధ్యే వార్ నడుస్తున్న విషయం తెలిసిందే... రెండు పార్టీల మధ్యే మాటల యుద్ధం తీవ్ర స్థాయిలో జరుగుతూ ఉంటుంది. రెండు పార్టీల నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటారు...అలాగే రెండు పార్టీలకు ప్రత్యేకమైన రాజకీయ శత్రువులు కూడా ఉంటారు. అలాంటి వారిని ప్రత్యేకంగా టార్గెట్ పెట్టుకుని రాజకీయం చేస్తుంటాయి.

ఇక జనసేన సైతం అధికార పార్టీపైనే పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే..కాకపోతే జనసేనకు పెద్దగా బలం లేకపోవడం వల్ల వైసీపీ నేతలు...ఎక్కువగా టీడీపీనే టార్గెట్ చేస్తారు. అయితే జనసేనని కొందరు వైసీపీ నేతలు ప్రత్యేకంగా లక్ష్యంగా చేసుకుని రాజకీయం చేస్తారు...ఉదాహరణకు పేర్ని నాని, కన్నబాబు, అంబటి రాంబాబు, అనిల్ కుమార్, వెల్లంపల్లి శ్రీనివాస్ లాంటి వారు స్పెషల్ గా పవన్ కల్యాణ్‌ని టార్గెట్‌గా పెట్టుకుని విమర్శలు చేస్తారు.

అందుకే పవన్ సైతం వారినే రివర్స్‌లో టార్గెట్ చేస్తారు..వారికి కూడా చెక్ పెట్టాలని పవన్ భావిస్తారు. అలా పవన్ స్పెషల్‌గా టార్గెట్‌గా పెట్టుకున్న వారిలో గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు కూడా ఒకరు అని చెప్పొచ్చు. గతంలో ఈయన ప్రజారాజ్యంలో పనిచేసిన విషయం తెలిసిందే....2009లో ప్రజారాజ్యం నుంచి పోటీ చేసి గిద్దలూరులో గెలిచారు...ఇక 2014లో టీడీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు..2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసి భారీ మెజారిటీతో గెలిచారు.

అయితే ఈయనకు జనసేన పార్టీతో ప్రత్యేకంగా యుద్ధం జరుగుతుంది..ఆ మధ్య ఒక జనసేన కార్యకర్త సమస్యలపై నిలదీస్తే..ఎమ్మెల్యే రాంబాబు బూతులు తిట్టిన విషయం తెలిసిందే. అలాగే తర్వాత జనసేన కార్యకర్త ఆత్మహత్య చేసుకుని చనిపోయారు..దీనికి కారణం ఎమ్మెల్యే రాంబాబుని పవన్ ఆరోపించిన విషయం తెలిసిందే. అయితే ఎప్పటికైనా రాంబాబు సంగతి చూస్తామని పవన్ అప్పుడే వార్నింగ్ ఇచ్చారు. అందుకే గిద్దలూరులో రాంబాబుపై జనసేన గట్టిగానే పోరాటం చేస్తుంది..కాకపోతే రాజకీయంగా బలంగా లేకపోవడం మైనస్..ఒకవేళ టీడీపీతో కలిస్తే రాంబాబుకు ఏమన్నా చెక్ పెట్టే ఛాన్స్ ఉంది. చూడాలి మరి రాంబాబుకు పవన్ చెక్ పెడతారో లేదో.


మరింత సమాచారం తెలుసుకోండి: