
అదే విధంగా ఈ రోజు గుంటూరులోని టీడీపీ కార్యాలయంలో కీలక భేటీ జరపనున్నారు. అందులో భాగంగా మొత్తం 12 నియోజకవర్గాల ఇంచార్జి లతో మాట్లాడనున్నారు. అంతే కాకుండా ఇదే సమావేశానికి విశాఖపట్నం, విజయనగరం, తూర్పు గోదావరి జిల్లాల ఎమ్మెల్యే లకు సైతం పిలుపు అందినట్లు సమాచారం. అయితే ఈ సమావేశానికి కారణం ఏమై ఉంటుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తెలుస్తున్న సమాచారం ప్రకారం జిల్లాలలో ఇప్పటికే కొనసాగుతున్న పార్టీ ఇంచార్జి లతో చర్చించి వారి పని తీరును తెలుసుకున్న తర్వాత అవసరం అనిపిస్తే వారినే కొనసాగించడం లేదంటే వారి స్థానంలో కొత్త వారిని నియమించనున్నట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమం గత మూడు రోజుల నుండి జరుగుతోందట.
ఈ మీటింగ్ కు ముఖ్య నేతలను హాజరు కావాలని చెప్పారట. అయితే రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే కొన్ని జిల్లాల్లో పార్టీని బలోపేతం చేయడానికి చంద్రబాబు ఈ సమావేశాన్ని నిర్వహించబోతున్నట్లు రాజకీయ వర్గాల నుండి అందుతున్న సమాచారం. రాబోయే ఎన్నికల్లో ఆయా నియోజకవర్గాల్లో సరైన నాయకులు లేకపోవడమే ఇందుకు కారణం. అందులో ప్రకాశం, నెల్లూరు, తూర్పు గోదావరి జిల్లాలపై దృష్టిని కేంద్రీకరించనున్నట్లు తెలుస్తోంది. ఇంకో సంవత్సరంలో ఎన్నికలు సమీపిస్తుండగా రాష్ట్ర వ్యాప్తంగా అందరి నేతలతో చర్చించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడానికి చంద్రబాబు వరుస సమావేశాలు పెట్టుకుంటున్నారు.