పంజాబ్‌లో పోటీ ప్రధానంగా అధికార కాంగ్రెస్, విపక్షాలు బీజేపీ, ఆప్, అకాదళ్ మధ్య పోటీ ఉంది. సీఎం చన్నీ.. చమ్ కౌర్ సాహిబ్ , భదౌర్ స్థానాల నుంచి పోటీ చేస్తున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ సీఎం అభ్యర్ధి భగవంత్ మాన్ ధురి నియోజకవర్గ నుంచి పోటీ చేస్తున్నారు. అమృత్‌సర్ తూర్పు నుంచి పోటీ చేస్తున్న పీసీసీ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ పోటీ చేస్తున్నారు. పటియాలా అర్బన్ నుంచి బరిలో మాజీ సీఎం అమరీందర్ సింగ్ బరిలో ఉన్నారు.
జలాబాబాద్ నుంచి అకాలీదళ్ అధినేత సుఖ్ బీర్ బాదల్ పోటీ చేస్తున్నారు. పంజాబ్ ఎన్నికల్లో కాంగ్రెస్, ఆప్ ఒంటరిగా పోటీచేస్తున్నాయి. శిరోమణి అకాళీదల్- బీఎస్పీ కూటమిగా పోటీ చేస్తుండగా.. మరో కూటమిగా బరిలో బీజేపీ, పీఎల్‌సీ, శిరోమణి అకాళీదళ్ సంయుక్త పార్టీ పోటీ చేస్తున్నాయి. ఇవాళ పోలింగ్ జరుగుతుండగా మార్చి 10న పంజాబ్ ఎన్నికల ఫలితాలు వెలువడతాయి.
ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ వరుసగా రెండు సార్లు అధికారంలో ఉంది. ఇప్పుడు మరోసారి అధికారం నిలబెట్టుకునేందుకు ప్రయత్నిస్తోంది. అయితే.. ఇప్పటికే ఢిల్లీలో సత్తా చాటిన ఆమ్ ఆద్మీ పార్టీ మొదటి సారి ఢిల్లీ వెలుపల సత్తా చాటాలని ఊవ్విళ్లూరుతోంది. ఆ పార్టీకి ఆదరణ కూడా బాగానే కనిపిస్తోంది. మరి ఆప్ సంచలనాలు నమోదు చేస్తుందా.. బహుముఖ పోటీలో గెలుపు ఎవరిని వరిస్తుంది.. అన్నది ఆసక్తికరంగా ఉంది.