భారత్ పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతమైన కాశ్మీర్ లో ఎప్పుడు ఉద్రిక్త పరిస్థితులు ఉంటాయి. ఒక రకంగా చెప్పాలంటే ఆ ప్రాంతంలో ఉంది ప్రతిరోజు మినీ సైజ్ యుద్ధం జరుగుతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే  ఒకవైపు ఉగ్రవాదులను భారత్ లోకి చొరబడ కుండా ఉండేందుకు భారత ఆర్మీ అప్రమత్తంగా ఉంటే మరోవైపు పాకిస్తాన్ సైనికులు  ఎటువైపు నుంచి ఎప్పుడు దాడి చేస్తారో అన్నది కూడా ఊహకందని విధంగానే ఉంటుంది. అయితే ఇటీవలి కాలంలో సైన్యానికి ఫుల్ పవర్స్ ఇచ్చిన నేపథ్యంలో ఇక సరిహద్దులో ఉగ్రవాదుల ఆటలు సాగడం లేదు. భారత భూభాగంలోకి అడుగుపెట్టాలని ఆలోచన వచ్చిన ఎక్కడికక్కడ ఎన్కౌంటర్ చేసేస్తుంది భారత ఆర్మీ.


 ఈ క్రమంలోనే ఇప్పుడిప్పుడే కాశ్మీర్ ప్రాంతంలో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అయితే కేవలం కాశ్మీర్ ప్రాంతంలోనే కాదు దేశంలోని ఎన్నో రాష్ట్రాలలో కూడా ఉగ్రవాద  సంస్థలకు సంబంధించిన స్లీపర్ సెల్స్ ను ఉంచి ఇక వారితో ఉగ్ర కుట్రలు చేయించడం లాంటివి ఉంటారు. ఇక ఇలాంటి వాటి పైన కూడా అటు భారత ఇంటెలిజెన్స్ విభాగం ఎప్పుడు దృష్టి పెడుతూ అటు ఉగ్ర కుట్రలను భగ్నం చేస్తూనే ఉంది అన్న విషయం తెలిసిందే. ఇలా గత కొంత కాలం నుంచి ఉగ్రవాదుల చేస్తున్న కుట్రలను ముందుగానే పసిగట్టి ఉగ్రవాదుల ఆటలు కనిపిస్తోంది.


 ఇకపోతే ఇటీవల దేశంలోని అనేక ప్రాంతాలలో దాడులు చేసేందుకు ఉగ్రవాదులు చేస్తున్న కుట్రలను ఎన్ ఐ ఏ చేధించింది. జమ్మూ కాశ్మీర్ రాజస్థాన్లోని 8 ప్రాంతాల్లో గత కొన్ని రోజులుగా సోదాలు చేసి కీలక పాత్రాలు, భారీగా సిమ్ కార్డులను,  కంప్యూటర్లు, మొబైల్ ఫోన్లను కూడా ఎన్ఐఏ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇక ఈ ఆధారాల ద్వారా ఎంతో కీలకమైన సమాచారాన్ని సేకరించి దాదాపు 28 మంది నిందితులను అరెస్టుచేసారూ ఎన్ఐఏ అధికారులు. ఇక రానున్న రోజుల్లో ఈ అరెస్టులు మరింత పెరిగే అవకాశం ఉంది అనేది తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: