నేను మోనార్క్ ని అంటారు
నాది జాతీయ వాదం అంటారు
నాది అల్లర్లు కోరుకోని మతవాదం అని చెబుతారు
ఇవే మాటలు ఆచరించే క్రమంలో ముందుంటారు
ఆయనే ప్రకాశ్ రాజ్ ఆజ్ కా రాజ్ ప్రకాశ్ రాజ్
ఓటమి ఓ ప్రధాన కారణం కావొచ్చు. కానీ అదే కారణం కాదు అని ఎవ్వరైనా తెలుసుకోవాలి.నిన్నటి వేళ ముంబయిదారుల్లో కన్నడ ప్రకాశ్ రాజ్ మెరిశారు.వాస్తవానికి ఆయనను ఆ విధంగా సంబోధించడం తప్పే కానీ ఆయన ఇలాంటివి ఒప్పుకోరు కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలుగు రాజకీయాల్లో కన్నడ ప్రభావం ఏ మేరకు ఉంటుందో చూద్దాం. మాట్లాడితే ఆయన ఓడిపోయారు ఓడిపోయారు అని రాస్తుంటారు. అది తప్పు.. ఆయన ఓడినా గెలిచినా ఓ విధంగా సైద్ధాంతిక విబేధంను మాత్రం కొనసాగిస్తున్నారు మోడీతో..!
ఆ రోజు బెంగళూరు సెంట్రల్ (పార్లమెంట్ నియోజకవర్గం) నుంచి ఆయన పోటీ చేసి ఓడిపోయారు అనే పదే పదే అంటుంటారు, అంటే ఓటమి అన్నది తెలియని వీరుడను నేను అని చంద్రబాబు మాదిరిగా కానీ కేసీఆర్ మాదిరిగా కానీ జగన్ మాదిరిగా కానీ ఏనాడయినా ఆయన స్టేట్మెంట్లు ఇచ్చారా? ఆ మాటకు వస్తే ఇప్పుడున్న వారందరి కన్నా ప్రకాశ్ రాజ్ మాత్రమే హుందాగా మాట్లాడతారు మన తెలుగు నాయకులు అందరి కన్నాతెలుగు బాగా పలుకుతారు రాస్తారు కూడా! ఇందులో కూడా తప్పేం లేదు. ఒప్పుకోవాల్సిందే.
ఇందుకు ఏ ఒక్కరి ఇగో అడ్డు వచ్చినా చేసేదేం లేదు కానీ ఆయన నిన్నటి వేళ అనే కాదు ఎప్పటి నుంచో కేసీఆర్ తో సన్నిహితంగానే ఉంటున్నారు.ఆ సన్నిహిత సూత్రాన్నే ఉద్ధవ్ ఠాక్రేతో జరిపిన చర్చల్లో కొనసాగించారు. నేను నా దేశ ప్రధానిని ప్రశ్నిస్తాను,ఎదిరిస్తాను అని కూడా ఎందుకు అంటారంటే ఆయనకు దేశం ఎదుర్కొంటున్న సమస్యలపై స్పష్టమయిన అవగాహన ఉంది కనుక! మన నాయకుల కన్నా స్పష్టం అయిన అవగాహన ఉంది కనుక ! ఈ నేపథ్యంలో ఆయన తెలుగు రాజకీయాల్లో ప్రభావ శీలక శక్తిగా ఎదిగేందుకు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.అదేవిధంగా కన్నడ నాట కూడా ఆయన ఇదే హవాను కొనసాగించే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆ విధంగా రెండు రాష్ట్రాల రాజకీయాలను ప్రభావితం చేయడమే ఆంధ్రా పాలిటిక్స్ పై కూడా ఆయన మంచి అవగాహనే ఉంది.ముఖ్యంగా ఆయనకు ఈ రెండు తెలుగు రాష్ట్రాలలో మంచి అభిమాన గణం ఉంది. దానిని కొట్టిపారేయలేం. కమ్యూనిజం కాస్త వినిపించినా కూడా వాటిపై కూడా స్పష్టమైన వైఖరితోనే మాట్లాడగల రాజకీయ నాయకుడు అతను. పవన్ ను నేరుగా విమర్శించి ఒప్పించే సత్తా ఉన్న నాయకుడు అతను.కనుక ఆయన తెలుగు రాజకీయాలను ముందున్న కాలంలోనూ ప్ఱభావితం చేయడం ఖాయం,ఇందులో తప్పేమీ లేదు.