ఇటు సీబీఐ అటు ఏపీ పోలీసు మధ్య వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు నలిగిపోతోందా ? క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అందరిలోను ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. వివేకా హత్య జరిగిన దగ్గర నుండి ఇఫ్పటికి ఎన్ని మలుపులు తిరిగిందో లెక్కేలేదు. అలాగే పోలీసులని తర్వాత సిట్ అని మళ్ళీ సీఐడీ దర్యాప్తని రకరకాల మలుపులు తిరిగి చివరకు హైకోర్టు ఆదేశాలతో సీబీఐ దగ్గర ఆగింది.





రోజుకో మలుపు తిరుగుతున్న కేసు విచారణలో రోజుకో కొత్త వ్యక్తి పేరు వినబడుతునే ఉంది. అప్పుడెప్పుడో అప్రవూర్ గా మారిపోతానని వివేకా డ్రైవర్ గా పనిచేసిన దస్తగిరి స్టేట్మెంట్, అప్పుడెప్పుడో సీబీఐకి పులివెందుల సీఐ శంకరయ్య ఇచ్చిన వాంగ్మూలం ఇపుడు ఎందుకు బయటకు వచ్చిందో అర్ధం కావటంలేదు. సీబీఐకన్నా ముందు దర్యాప్తు చేసిన రాష్ట్ర పోలీసుల మీద కానీ లేదా ఇపుడు దర్యాప్తు చేస్తున్న సీబీఐ మీద ఒత్తిళ్ళు  అర్ధమవుతోంది.





ఇక్కడ గమనించాల్సిందేమంటే సీబీఐ అడిషినల్ ఎస్పీ రామ్ సింగ్ మీద ఏపీ పోలీసులు కేసు నమోదు చేసిన రోజే అప్పుడెప్పుడో సీఐ శంకరయ్య ఇచ్చిన వాంగ్మూలం వెలుగుచూడటం. సీబీఐ అధికారి మీద పోలీసులు కేసు నమోదు చేసిన తర్వాతే సీఐ వాంగ్మూలం ఎందుకు బయటకు వచ్చింది ? ఎలాగొచ్చింది ? అంటే వివేకా హత్యకేసు నేపధ్యంలో ఇటు పోలీసులకు అటు సీబీఐకి మధ్య ఇగో ప్రాబ్లెమ్స్ పెరిగిపోతున్నట్లుంది. అధికారపార్టీ నేతలేమో సీబీఐ దర్యాప్తునే అనుమానిస్తున్నారు.





ఇదే సమయంలో జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుల్లో ఒకడైన ఎంపీ అవినాష్ రెడ్డి హస్తం ఉందనే అనుమానాలు బలపడేట్లుగా సీబీఐ దర్యాప్తు విషయాలు మీడియాలో కనబడుతున్నాయి. మొత్తానికి పోలీసులు సీబీఐ అడిషినల్ ఎస్పీ రామ్ సింగ్ ను ఏమి చేస్తారో తెలీదు. అలాగే సీబీఐ కూడా ఎంపీ అవినాష్ హస్తాన్ని ఏ మేరకు రుజువు చేస్తుందో కూడా తెలీదు. మధ్యలో వివేకానందరెడ్డి హత్య కేసు మాత్రం బాగా నలిగిపోతోందన్నది వాస్తవం. మరి ఈ కేసుకు ఎప్పుడు మోక్ష లభిస్తుందో ఏమో.






మరింత సమాచారం తెలుసుకోండి: