రష్యా ఉక్రెయిన్ ల మధ్య యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. గత అర్థ రాత్రి నుండి రష్యా సైనిక బలగాలు ఉక్రెయిన్ సరిహద్దులను చుట్టు ముట్టి లోపలికి వెళ్లారు. ఇప్పటికే ముఖ్య నగరాలను హస్తగతం చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ రోజు ఉక్రెయిన్ మొదట్లో ప్రతి దాడి చేయకపోయినా ఆ తర్వాత వారిని ప్రతిఘటించడానికి తన వంతు ప్రయత్నం చేస్తోంది. ఈ యుద్ధంపై అమెరికా, ఫ్రాన్స్ మరియు బ్రిటన్ లు సానుభూతి చూపిస్తున్నారు. పైగా ఈ మూడు దేశాలు ఏ క్షణామైనా ఉక్రెయిన్ కు మద్దతుగా యుద్ధంలో పాల్గొనే అవకాశం ఉంది అని తెలుస్తోంది. దీనికి రష్యా అధ్యక్షుడు పుతిన్ గర్వంతో మాట్లాడిన మాటలే.

ఇదిలా ఉంటే ఈ యుద్ధం పై పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. ప్రస్తుతం పాక్ ప్రధానిగా ఉన్న ఇమ్రాన్ ఖాన్ రష్యా పర్యటనలో ఉన్నారు. రెండు రోజుల ముందు రష్యా పర్యటన కోసం కొందరు ముఖ్య నేతలతో బయలుదేరి వెళ్ళారు. ఇంతటి పరిస్థితుల మధ్యన రష్యా పర్యటనకు వెళ్ళడం అంటే ఆలోచించండి... ఇమ్రాన్ ఖాన్ కు యుద్ధం పట్ల ఎంతటి సానుకూల దృక్పథం ఉందో... గత వారం రోజులుగా సైనిక బలగాన్ని ఉక్రెయిన్ సరిహద్దుల్లో మోహరించారు. కానీ దాడి చేయలేదు. కానీ ఇమ్రాన్ ఖాన్ అలా వెళ్ళాడో లేదో మరుసటి రోజే యుద్ధం జరగడానికి కారణం అయింది.

అందుకే ఇమ్రాన్ ఖాన్ ప్రోద్బలంతోనే యుద్ధం జరిగి ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పైగా ఈ యుద్ధం గురించి ఇమ్రాన్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు కూడా మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి. ఇమ్రాన్ ఖాన్... ఎన్నో రోజుల నుండి ఎదురు చూస్తున్న సమయం ఇదే అంటూ... ఉక్రెయిన్ పై దాడి చేయడం నాకు ఎంతో సంతోషాన్ని కలిగించింది అన్నారు. ప్రపంచం అంతా యుద్ధోన్మాద రీతిలో త‌గ‌ల‌డిపోతుంటే న‌వ్వుతూ న‌వ్వులు చిందిస్తూ ఓ దేశాక్షుడు పైశాచిక ఆనందం పొంద‌డం స‌బ‌బేనా !

మరింత సమాచారం తెలుసుకోండి: