ఐదురోజులుగా జరుగుతున్న యుద్ధం తర్వాత యావత్ ప్రపంచం ఇలాగే అనుకుంటోంది. ఎందుకంటే సైనికశక్తిలోనే కాదు ఏ విషయంలో తీసుకున్నా రష్యా  ముందు ఉక్రెయిన్ నిజంగా చిట్టెలుకనే చెప్పాలి. అలాంటి చిట్టెలుకే యుద్ధంలో రష్యాను ముప్పుతిప్పలు పెడుతోంది. యుద్ధంలో అంతిమ విజయం ఎవరిది ? భారీగా నష్టపోయింది ? ఎవరు అన్న విషయాలు ఇపుడనవసరం. ఎందుకంటే రష్యా యుద్ధం మొదలుపెట్టినపుడు 48 గంటల్లోనే ఉక్రెయిన్ సరండెర్ అయిపోతుందని చాలామంది అనుకున్నారు.





అలాంటిది నాలుగు రోజులు దాటిపోయినా ఇంకా యుద్ధం జరుగుతోంది అంటేనే ఉక్రెయిన్ ఎంతగా రష్యా సైన్యాన్ని ప్రతిఘటిస్తోందో అర్ధమైపోతోంది. పైగా నాలుగోరోజు రష్యా సైన్యంపైకి మామూలు జనాలు కూడా ఆయుధాలు ఎక్కుపెట్టారు. ఉక్రెయిన్ అధ్యక్షడు జెలెన్ స్కీ ఆదేశాల ప్రకారం జనాలకు లక్ష ఏకే 47 రిఫైల్స్ ఇచ్చేశారు. చేతికి దొరికిన ఆయుధాలతో జనాలంతా ఎక్కడెకక్కడ రష్యా సైన్యంపై తిరగబడుతున్నారు. అలాగే చాలాచోట్ల జనాలు పెట్రో బాంబులు విసురుతున్నారు. కొన్నిచోట్ల ఆత్మాహుతి బాంబర్లు తయారయ్యారు.





ఉక్రెయిన్లో సైనికులతో పాటు మామూలు జనాలు కూడా తమ సైన్యంపై ఈ స్ధాయిలో తిరగబడతారని పుతిన్ ఊహించుండడు. దీనికితోడు అమెరికా, జర్మనీ, ఫ్రాన్స్ దేశాలు భారీ ఎత్తున స్టింగర్లు, రైఫిల్స్ ను ఉక్రెయిన్ కు సరఫరా చేశాయి. దాంతో ఉక్రెయిన్ సైన్యం+మామూలు జనాలు రష్యా సైన్యంపై రెచ్చిపోతున్నారు. నిజానికి యుద్ధంలో ఏ దేశానికీ విజయం అనేదుండదు. ఎందుకంటే రెండు వైపులా ఏదోరూపంలో భారీ నష్టాలే ఉంటాయి.




3500 మంది రష్యా సైన్యాన్ని చంపేశామని, వందలమందిని బంధీలుగా పట్టుకున్నామని ఉక్రెయిన్ సైన్యాధికారులు ప్రకటిస్తున్నారు. క్షిపణులను, ఫైటర్ జెట్లను, యుద్ధ హెలికాప్టర్లను రష్యా పెద్ద సంఖ్యలోనే కోల్పోయింది. రష్యా ఫైటర్లను ఉక్రెయిన్ కూల్చేయటం వెనుక అమెరికా మార్గదర్శకత్వమే ఉందంటున్నారు. వాళ్ళిచ్చిన ఆయుధాలతోనే రష్యా ఫైటర్ ప్లేన్లు, హెలికాప్టర్లను ఉక్రెయిన్ కూల్చేస్తోందట. చూడబోతే మరిన్ని దేశాలు ఉక్రెయిన్ కు మద్దతుగా ఆయుధాలను, డబ్బును సాయం చేసేట్లున్నాయి. ఇదే జరిగితే రష్యా అధ్యక్షుడు పుతిన్ కు మరింత షాక్ తప్పదు.





మరింత సమాచారం తెలుసుకోండి: