విశాఖ :  సాక్షి కేసు వచ్చే నెల 14 వాయిదా వేసారని.. వ్యక్తిగతంగా హాజరు కావోద్దని తెలిపారన్నారు నారా లోకేష్.  తప్పుడు వార్తలు ఎవ్వరు రాసిన ఊరుకోనేది లేదు.. ఇంకా ఎన్నాళ్ళు మా పై తప్పుడు వార్తలు రాస్తారు.. జగన్ లాగా 16నెలలు జైల్ కి వెళ్లి కోర్టు కి రాలేదు...న్యాయం కోసం వచ్చానని వెల్లడించారు నారా లోకేష్.  జగన్మోహనరెడ్డి ఓ  ఫ్యాక్షనిస్టు వ్యాపారాలన్ని తానే చేయ్యాలని రాష్ట్రంలో ఉన్న మిగత వారిని వేధిస్తు భయపెడుతున్నారని మండిపడ్డారు నారా లోకేష్. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ పై పడ్డారని.. ఇండియా లో ఎక్కడా లేని షరతులు పెట్టారు...రాష్ట్రంలో సిని ఇండస్ట్రీ లేకుండా చేయ్యాలని చుస్తున్నారని నిప్పులు చెరిగారు నారా లోకేష్.  కొత్త రాజదాని విశాఖ అని ఏం పీకారని.. అదానీ డేటా సెంటర్ ముంబై పోయింది...ఓక్క పరిశ్రమ రాలేదన్నారు నారా లోకేష్.  ఏపీ పెట్టుబడులు ప్రక్క రాష్ట్రాలు లో పెడుతున్నారని.. వైసిపీ వారు అంతా గాడిదలు కాస్తున్నారు.. వైసీపీ వాళ్ళు ఇక్కడ డబ్బులు దోచుకోని ఇతర రాష్ట్రాల్లో పెట్టుబడులు పెడుతున్నారని అగ్రహించారు నారా లోకేష్.


 బాబాయ్ హత్య పై జగన్ ఎందుకు స్పందించడం లేదు? ఎందుకు చంపిన వాళ్ళు ను కనిపెట్టడం లేదు.. ఎందుకంటే వాళ్ళే సూత్రధారులు కాబట్టి అన్నారు నారా లోకేష్.  సీబీఐ పై పోలీసులు కేసులు పెట్టడం ఫస్ట్ టైం చూస్తున్నానని.. సునీతా రెడ్డి చెప్పారు హత్య వెనుక ఎవరున్నారో నని చెప్పారు నారా లోకేష్. 2019లో చంద్రబాబు చంపారు అన్న జగన్  అధికారం లో వచ్చాక ఎందుకు సీబీఐ విచారణ కోరలేదన్నారు నారా లోకేష్.   అవినాష్ రెడ్డి గుండె పోటు అని చెప్పి ఇప్పుడు రోడ్ల పై తిరుగుతున్నారని ఫైర్ అయ్యారు నారా లోకేష్.  భీమ్లా నాయక్ సినిమా నాకు నచ్చింది అందుకే  సోషల్  మీడియా లో చెసానని.. అన్ని సినిమాలు నచ్చలని లేదన్నారు నారా లోకేష్. ఎవరి పై సోషల్ మీడియా పెట్టాలో వాళ్ళు చెప్పాలా ? అని నిలదీశారు నారా లోకేష్. జగన్మోహనరెడ్డి కి ఓటీపీ కి ఓటీటీ కి తేడా తెలియదన్నారు నారా లోకేష్. 5.4 లక్షల ఉద్యోగాలు కల్పన చంద్రబాబు హయాంలో వచ్చాయని అని గౌతం రెడ్డి చెప్పా రన్నారు నారా లోకేష్.

మరింత సమాచారం తెలుసుకోండి: