రష్యా మరియు ఉక్రెయిన్ ల మధ్య జరుగుతున్న యుద్ధం కొంత పుంతలు తొక్కుతోంది. ఈ రోజుకి ఈ భీకర ఆధిపత్య సమరానికి 10 రోజులు అయింది. అయితే అప్పుడెప్పుడో జరిగిన మొదటి మరియు రెండవ ప్రపంచ యుద్ధాల తర్వాత ఆ స్థాయిలో జరుగుతున్న యుద్ధం ఇదే కావడం మన దురదృష్టకరం. ఇంత అభివృద్ధి జరిగి ప్రపంచ శాంతి కోసం ఐక్యరాజ్యసమితి లాంటివి ఉన్నా ఇలాంటి యుద్ధం చోటు చేసుకోవడం నిజంగా ఆశ్చర్యకరం అని చెప్పాలి. రష్యా  నిన్నటి నుండి ఉక్రెయిన్ లో ఉన్న పవర్ ప్లాంట్ లను స్వాధీనం చేసుకోవడంలో తమ దృష్టిని కేంద్రీకరించింది.

అందులో భాగంగా రెండు న్యూ క్లియర్ పవర్ ప్లాంట్ లను తమ ఆధీనంలోకి తీసుకుంది. ఇప్పటి వరకు రష్యా అధ్యక్షుడు పుతిన్ ఎటువంటి దయ లేకుండా ప్రవర్తించాడు. కానీ తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం యుద్దాన్ని ఆపివేసినట్లు తెలుస్తోంది. దీని వెనుక ఒక బలమైన కారణం ఉన్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే ఈ యుద్ధం ఆపాలని ప్రపంచ దేశాలు అన్నీ ఏకమై రష్యాను అడుగుతున్నా వినిపించుకోలేదు. కానీ ఇప్పుడు వారి అభ్యర్థన మేరకు కొన్ని గంటల పాటు ఉక్రెయిన్ లో యుద్దాన్ని ఆపి వేస్తున్నట్లు రష్యా సైన్యం ప్రకటించింది.

బ్రతుకుజీవుడా అంటూ   బయట దేశాల నుండి ఇక్కడకు వచ్చి జీవిస్తున్న వారిని క్షేమంగా వారి వారి దేశాలకు తరలించడం కోసం అయిదున్నర గంటలు విశ్రాంతి ఇచ్చారు. ప్రస్తుతం ఉక్రెయిన్ ప్రశాంతంగా ఉంది, మరి ఇదే విధంగా త్వరలోనే పూర్తి స్థాయిలో యుద్దాన్ని ఆపాలని కోరుకుందాం. ఇంతటి ప్రాణ నష్టం ఆస్థి నష్టం జరిగాక అయినా రష్యా అధ్యక్షుడు పుతిన్ మనసు మారుతుందా లేదా అన్నది తెలియాలంటే వేచి చూడాలసిందే. కాగా ఈ సోమవారం మరియు మంగళవారం ఐసీజే లో ఈ యుద్ధంపై బహిరంగ విచారణ చేయనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: