ఈ సారి ఏపీలో ఎన్నికలు హోరాహోరీగా జరిగేలా ఉన్నాయి...గత ఎన్నికల మాదిరిగా వన్‌సైడ్‌గా మాత్రం ఎన్నికలు జరిగేలా లేవు..ఈ సారి మాత్రం వైసీపీకి టీడీపీ గట్టి పోటీ ఇచ్చేలా ఉంది..ఈ రెండు పార్టీల మధ్య టఫ్ ఫైట్ జరగడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక ఈ టఫ్ ఫైట్‌లో ఎవరు పైచేయి సాధిస్తారనేది ఇప్పుడే క్లారిటీ వచ్చే అవకాశం లేదు. ఏదో పైకి వైసీపీ అధికార బలంతో స్ట్రాంగ్‌గా కనిపిస్తోంది...గాని క్షేత్ర స్థాయిలో మాత్రం వైసీపీకి అంత అనుకూల పరిస్తితులు మాత్రం లేవు..అలా అని పూర్తిగా టీడీపీ బలపడిందని చెప్పడానికి లేదు..ఇంకా ఆ పార్టీ కొన్ని చోట్ల వీక్‌గానే కనిపిస్తోంది.

కానీ ఏదేమైనా రెండు పార్టీల మధ్య హోరాహోరీ పోరు జరిగే ఛాన్స్ ఉంది...అయితే ఎన్నికలకు ఇంకా రెండేళ్లుపైనే సమయం ఉండగానే, ఇప్పటినుంచే ఏపీలో ఎన్నికల వాతావరణం ఉంది..రెండు పార్టీలు నెక్స్ట్ ఎన్నికలే టార్గెట్‌గా రాజకీయం చేస్తున్నాయి..అసలు జగన్ 30 ఏళ్ల పాటు సీఎంగా ఉంటారని వైసీపీ నేతలు కాన్ఫిడెన్స్‌తో చెబుతున్నారు..ఇక నెక్స్ట్ అధికారంలోకి వచ్చేది తామే అని, నెక్స్ట్ ఎన్నికల్లో టీడీపీ 160 సీట్లతో అధికారంలోకి వస్తుందని టీడీపీ నేతలు హడావిడి చేస్తున్నారు.

ఇదే సమయంలో నెక్స్ట్ ఎన్నికల్లో రాజధాని అంశం కూడా కీలకంగా మారే ఛాన్స్ ఉంది...వైసీపీ ఏమో మూడు రాజధానుల కాన్సెప్ట్‌తో ఎన్నికలకు వెళ్తామని చెబుతుంది...అటు టీడీపీ ఏమో ఎప్పటినుంచో అమరావతి విషయంలో ముందుకెళుతుంది. అంటే జగన్ ఏమో మూడు రాజధానులు..బాబు ఏమో ఒకే రాజధాని అమరావతిని ముందు పెట్టుకుని ఎన్నికల బరిలో దిగనున్నారు.

అయితే ఈ రాజధానుల కాన్సెప్ట్ విషయంలో ప్రజల మైండ్‌సెట్ ఎలా ఉందో ఇంకా క్లారిటీ రావడం లేదు. స్థానిక ఎన్నికల్లో వైసీపీని వన్‌సైడ్‌గా గెలిపించినంత మాత్రాన...మూడు రాజధానులకు మద్ధతు ఇచ్చారని అనుకోవడానికి లేదు. ఇక నెక్స్ట్ ఎన్నికలే రాజధాని అంశాన్ని డిసైడ్ చేస్తాయని చెప్పొచ్చు. మరి చూడాలి జగన్ ‘మూడు’తో గెలుస్తారో లేక బాబు ‘ఒకటి’తో గెలుస్తారో.  

మరింత సమాచారం తెలుసుకోండి: