భారత రక్షణ రంగాన్ని పటిష్టవంతం చేసుకోవడమే లక్ష్యంగా అటు భారత ప్రభుత్వం ఎంత వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ముఖ్యంగా  సరిహద్దుల్లో చైనాతో ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితుల కారణంగా భారత ఆర్మీనీ పటిష్టవంతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని భావించిన భారత ప్రభుత్వం బడ్జెట్లో భారీగా నిధులు కేటాయించడం మొదలు పెట్టింది. తద్వారా ఇతర దేశాలనుంచి ఎంతో అధునాతనమైన ఆయుధాలను కొనుగోలు చేస్తూ భారత అమ్ములపొదిలో చేర్చుతుంది. అంతే కాకుండా భారత రక్షణ రంగ పరిశోధన సంస్థ ఇస్రో శాస్త్రవేత్తలకు పూర్తిస్థాయి ప్రోత్సాహం అందిస్తూ ఉండడంతో ఇక భారత శాస్త్రవేత్తలు కూడా వినూత్నమైన ఆయుధాలను అభివృద్ధి చేస్తున్నారు.


 గత కొంత కాలం నుంచి డి ఆర్ డి ఓ  శాస్త్రవేత్తలు అద్భుతమైన ఆయుధాలను అభివృద్ధి చేయడం వాటి ప్రయోగాలు నిర్వహించి సక్సెస్ సాధించడం లాంటివి చేస్తూ ఉన్నారు అన్న విషయం తెలిసిందే. ఇలా ఇప్పటివరకు కేవలం కొన్ని నెలల కాలంలోనే 11 పైగా మిస్సైల్స్ ను అభివృద్ధి చేసి ప్రయోగాల నిర్వహించింది డి ఆర్ డి ఓ. ఇక ఇలా డి ఆర్ డి ఓ  తయారు చేసిన అద్భుత ఆయుధాలలో బ్రహ్మోస్ మిస్సైల్ ఒకటి అనే విషయం తెలిసిందే. ఇక భారత్ తయారుచేసిన బ్రహ్మోస్ మిస్సైల్ అటు భారత ఆయుధం విక్రయాలను కూడా పెంచుతూ ఉంది.



 ఇకపోతే ఇటీవలే భారత నౌకాదళం మరో చారిత్రాత్మక మైలురాయిని దాటింది. ఇప్పటికే డిఆర్డిఓ తయారుచేసిన బ్రహ్మోస్ మిస్సైల్ భూమి నుంచి ఆకాశం లోకి కచ్చితత్వంతో టార్గెట్ ను చేదిస్తుంది అని శాస్త్రవేత్తలు తెలిపారు. ఇక ఇప్పుడూ సముద్రం నుంచి భూమ్మీదికి అత్యంత కచ్చితత్వంతో లక్ష్యాన్ని ఢీకొట్టే మిస్సైల్ ప్రయోగం సక్సెస్ అయింది. అరేబియా సముద్రం జలాల్లో ఐఎన్ఎస్ చెన్నై యుద్ధనౌక నుంచి ప్రయోగించిన బ్రహ్మోస్  సూపర్ సోనిక్ క్రూయిజ్ మిసైల్ విజయవంతమైందని ఇటీవలే భారత నేవీ ప్రకటించింది. ఆత్మ నిర్భర్ భారత్ లో భాగంగా పూర్తిస్థాయి స్వదేశి టెక్నాలజీతో తయారు చేసినట్లు అధికారులు చెబుతున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: