నాగర్ కర్నూల్ జిల్లా... కల్వకుర్తిలో ఏఐసీసీ కార్యదర్శి,మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈనెల 13న కొల్లాపూర్ లో నిర్వహించే కొల్లాపూర్ మన ఊరు మన పోరు  భారీ బహిరంగ సభ లో ఉమ్మడి పాలమూరు జిల్లా లో నెలకొన్న అన్ని సమస్యల ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేందుకు కొల్లాపూర్ డిక్లరేషన్ పేరుతో టీ పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు సంపత్ కుమార్ పేర్కొన్నారు సంపత్ కుమార్. ముఖ్యమంత్రి  కేసీఆర్ వనపర్తి లో నిర్వహించిన బహిరంగ సభలో, ఉమ్మడి పాలమూరు జిల్లాలో పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులు, సమస్యల పై చర్చించకపోవడం దరిద్రం...   ముఖ్యమంత్రి చేతకాని తనం వల్ల, స్వయంగా  తెలంగాణ ప్రభుత్వం పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు  పూర్తిచేయదని చెన్నై లో  NGC కి నివేదించిన కేసీఆర్ ఏ మొఖం పెట్టుకొని వనపర్తి లో సభ ను  నిర్వహించారన్నారు సంపత్ కుమార్. 

 కల్వకుర్తి ఎత్తిపోతల ప్రాజెక్టు  నుంచి 20 టీఎంసీల నీళ్లు అక్రమంగా నల్గొండ ప్రాంతానికి తరలిస్తూ ఈ ప్రాంత ప్రజలను మోసం చేస్తున్నారని... ఉమ్మడి పాలమూరు లో ప్రవహించే కృష్ణా తుంగభద్ర నీళ్లను అక్రమంగా డి పి ఆర్  ఏర్పాటు చేసి తరలించడానికి కేంద్రం ప్రయత్నిస్తోందని ఫైర్‌ అయ్యారు సంపత్ కుమార్.   రాష్ట్రంలో లక్ష 92 వేళా ఉద్యోగాలు కాళీగా ఉన్నాయని బిశ్వాల్ కమిటీ రాష్ట్ర నికి నివేదిక ఇస్తే,50 శాతం కోత విధిస్తూ ఖాళీలను పూర్తిగా భర్తీ చేయకుండా కేవలం 90 వేల ఖాళీలను ప్రకటించి నిరుద్యోగులను  మోసం చేస్తున్నారు... గత 8 సంవత్సరాలుగా శాసనసభను  వేదికగా చేసుకొని, పచ్చి అబద్ధాలు చెప్తూ,ప్రశ్నించిన ప్రతిపక్షాల గొంతును నొక్కేస్తున్నారన్నారు సంపత్ కుమార్.  నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తానని అధికారం లోకి వచ్చి 3 సం,, లుగా దాని ఉసేలేకుండా పోయిందని.. దేశాన్ని ఉద్దరిస్తానాని దేశము మొత్తం తిరుగుతున్న కేసీఆర్ సొంత రాష్టం లో ఉన్న నదులపై,కేంద్రం హక్కుల్ని కాల రాస్తుంటే కేసీఆర్ ఏం చేస్తున్నారని నిప్పులు చెరిగారు సంపత్ కుమార్.

మరింత సమాచారం తెలుసుకోండి:

trs