కోర్టు తీర్పులకు సంబంధించి తెలుగులో ఒక సామెతుంది. అదేమిటంటే ‘ఓడినవాడు కోర్టులో ఏడిస్తే గెలిచిన వాడు ఇంటికొచ్చి ఏడ్చాడ’ని. ఇపుడీ సామెత ఎందుకంటే అమరావతి రాజధాని నిర్మాణంపై హైకోర్టు ఇచ్చిన తీర్పు తెలుగుదేశంపార్టీకి బాగా సరిపోతుందట. ఎందుకయ్యా అంటే హైకోర్టు తీర్పుపై జగన్మోహన్ రెడ్డి స్పందన ఎలాగున్నది ? జగన్ ఆలోచనలు ఏమిటి ? అనేది ఎవరికీ అంతుపట్టడం లేదు. కానీ ఇదే తీర్పు టీడీపీలో మాత్రం టెన్షన్ పెంచేస్తోంది.





ఎందుకంటే కోర్టు తీర్పుప్రకారం రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల అభివృద్ధి ఎలాగున్నా అమరావతి మాత్రం డెవలప్ అవ్వాల్సిందే అన్నట్లుగా ఉంది. రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాలైన రాయలసీమ, ఉత్తరాంధ్రను ఎండగట్టి అమరావతిని మాత్రమే డెవలప్ చేయాలని చంద్రబాబు కంకణం కట్టుకున్నారు. అయితే ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ ప్రయత్నాలను 2019 ఎన్నికల్లో జనాలే అడ్డుకుని ఘోరంగా ఓడించారు. అధికారంలోకి వచ్చిన జగన్మోహన్  రెడ్డి అమరావతి జోరకు కళ్ళెంవేసి ఉత్తరాంధ్ర, రాయలసీమను కూడా డెవలప్ చేద్దామని అనుకున్నారు.





అయతే జగన్ ప్రయత్నాలను అడ్డుకునేందుకు హైకోర్టులో చంద్రబాబు కేసులు వేయించారు. ఇపుడిదే టీడీపీకి పెద్ద సమస్యగా మారింది. తొందరలోనే చంద్రబాబు ఒకవైపు పుత్రరత్నం నారా లోకేష్ మరోవైపు రాష్ట్రంలో యాత్రలు చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అంటే ఉత్తరాంధ్రలోని శ్రీకాకళం నుండి ఒకరు, రాయలసీమలోని చిత్తూరు జిల్లా నుండి మరొకరు యాత్రకు రెడీ అవుతున్నారని సమాచారం. మరి ఆ యాత్రల్లో వాళ్ళు రాయలసీమ, ఉత్తరాంధ్ర జనాల ఆగ్రహాన్ని ఎలా తట్టుకుంటారు ?





రాయలసీమలో కర్నూలుకు హైకోర్టు, ఉత్తరాంధ్రలోని వైజాగ్ ను పరిపాలనా రాజదానిగా చంద్రబాబు అడ్డుకున్నారు. కోర్టులో కేసులు వేయించి జగన్ ప్రయత్నాలను అడ్డుకున్న చంద్రబాబుపై రెండుప్రాంతాల్లోని జనాలు మండిపోతున్నారు. మరి యాత్రలు మొదలవ్వటం ఆలస్యం పై ప్రాంతాల్లోని జనాలు తిరగబడతారేమో అనే టెన్షన్ తమ్ముళ్ళల్లో కనబడుతోంది. పైగా అసెంబ్లీ సమావేశాలు అయిపోగానే రచ్చబండ పేరుతో జగన్ జనాల్లో తిరగాలని ప్లాన్ చేస్తున్నారు. అమరావతి విషయంలో చంద్రబాబు కుట్ర చేశారని ప్రతిచోట జగన్ చెప్పే అవకాశముంది. జనాలు కూడా జగన్ కు పాజిటివ్ గా రెస్పాండ్ అయితే మరి చంద్రబాబు పరిస్దితి ఏమవుతుందో ?





మరింత సమాచారం తెలుసుకోండి: