
దీనితో మరోసారి మోదీ హవా ఆయా రాష్ట్రాలలో కొనసాగింది అని చెప్పాలి. అయితే అయిదు రాష్ట్రాలలో ఇప్పుడు అందరి దృష్టి ఉత్తరప్రదేశ్ మీదనే నెలకొంది. ఈ రాష్ట్రంలో మొత్తం 403 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. కాగా ఈ రాష్ట్రంలో విజయం కావాలంటే 202 స్థానాలలో గెలుపొందిన పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. అయితే ఇవాళ పొద్దున కౌంటింగ్ ప్రారంభం అయిన క్షణం నుండి బీజేపీ లీడింగ్ లో ఉంది. ప్రస్తుతానికి బీజేపీ అధికారానికి కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ దాటేసింది. మిగిలిన పార్టీలలో సమాజ వాధి పార్టీ 100 కు పైగా స్థానాలతో ఉంటే మిగిలిన పార్టీలు దరిదాపుల్లో కూడా లేవు.
దీనితో ఉత్తరప్రదేశ్ లో మరోసారి బీజేపీ ప్రభుత్వం రానుంది. ఇక ఉత్తరప్రదేశ్ సీఎం గా ఉన్న యోగి ఆదిత్యనాధ్ గోరఖ్ పూర్ నుండి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతానికి యోగి ఆదిత్యానాధ్ 60 వేలకు పైగా ఓట్ల మెజార్టీలో కొనసాగుతున్నారు. అయితే ఈ సారి కూడా సీఎంగా యోగిని కొనసాగిస్తారా లేదా వేరొకరికి అవకాశం కల్పిస్తారా అన్నది తెలియాల్సి ఉంది.