అమరావతి : వనజాక్షిని చింతమనేని జుట్టు పట్టుకుని ఈడ్చినట్టు.. డ్వాక్రా మహిళలను చంద్రబాబు రోడ్డు పైకి ఈడ్చారని ఫైర్ అయ్యారు సీఎం జగన్. సెల్ ఫోన్ నేనే కనిపెట్టాను.. హైటెక్ సిటీ నేనే కట్టాను.. అదుగో హైపర్ లూప్.. అంటూ చంద్రబాబు బడాయిలు చెప్పుకున్నారని అగ్రహించారు సీఎం జగన్. సత్యనాదెళ్లకు తానే కంప్యూటర్ చదువు చెప్పించాను.. పీవీ సింధుకు నేనే బ్యాడ్మింటెన్ నేర్పించానని చెప్పుకునే చంద్రబాబు దిశా యాప్ రూపొందించాలని.. గ్రామ సచివాలయాలు నిర్మించాలనే ఆలోచన రాలేదా..? అని ఎద్దేవా చేశారు సీఎం జగన్. 14 ఏళ్లు సీఎంగా పని చేసిన తర్వాత కూడా 30 లక్షల మందికి ఇళ్లు లేకుండా ఎలా ఉండగలిగారోనని విషయమై చంద్రబాబు సమాధానం చెప్పగలరా..? అని నిలదీశారు సీఎం జగన్. చంద్రబాబు బీసీలను పని ముట్లుగానే వాడుకునేవారన్నారు సీఎం జగన్.

అగ్రీ గోల్డ్ బాధితులు ఇబ్బందులు పడుతున్నా.. అగ్రీ గోల్డును దోచుకునే ప్రయత్నం చేశారు చంద్రబాబు అని ఫైర్ అయ్యారు సీఎం జగన్. వైసీపీ ప్రభుత్వమే రూ. 905 కోట్లు అగ్రీ గోల్డ్ బాధితులకు చెల్లించిందన్నారు సీఎం జగన్. అధికారంలో ఉన్నప్పుడు పట్టపగలే గుళ్లు కూలగొట్టించిన టీడీపీకి.. అధికారం కొల్పోయిన తర్వాత చీకట్లో విగ్రహాలు విరిచేయాలని.. రథాలు తగులపెట్టాలన్న ఆలోచనలు రాకుండా పోతాయా..? అని నిలదీశారు సీఎం జగన్. రాజధానులను వికేంద్రీకరిస్తామంటే నా భూములు.. నా వాళ్ల భూములు.. నా రేట్లు అనే ఆలోచనే చంద్రబాబు చేశారు... 13 జిల్లాల్లో అభివృద్ధి.. మూడు ప్రాంతాల్లో సమాన అభివృద్ధి అనే ఆలోచన చంద్రబాబుకు ఏనాడూ లేదన్నారు సీఎం జగన్. ప్రజల సభల్లో తీసుకున్న నిర్ణయా ల కు వ్యతిరేకంగా రాజధా ని స హా.. ఇళ్లస్థలాలు.. ఇంగ్లిష్ మీడియం స్కూళ్లపై కోర్టుల్లో కేసులు వేయించి చంద్రబాబు సంతో ష ప డ్డా ర న్నా రు సీ ఎం జ గన్.

మరింత సమాచారం తెలుసుకోండి: