ఇకపోతే ప్రయాణికుల సౌకర్యార్థం కూడా ఇప్పటికే ఎన్నో అధునాతనమైన సౌకర్యాలను కూడా అందుబాటులోకి తీసుకువచ్చారు. ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకున్న టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ప్రశంసలు అందుకుంటున్నారు. తాజాగా బస్సులు ఎక్కేందుకు చంటి బిడ్డలతో బస్టాండ్ కు వచ్చే తల్లుల కోసం బేబీ ట్రాలీలను కూడా ఏర్పాటు చేసేందుకు సిద్ధమయ్యారు. తల్లులు తమ పిల్లలను అందులో కూర్చోబెట్టి నెట్టుకుంటూ బస్సు వద్దకు వెళ్లేందుకు అవకాశం ఉంటుంది. ప్రస్తుతం వీటిని ఎంజీబీఎస్ జేబీఎస్ లో అందుబాటులోకి తీసుకువచ్చామని.. ఇక త్వరలో అన్ని బస్ స్టేషన్లలో కూడా దీనిని అందుబాటులోకి తీసుకువచ్చేందుకు కృషి చేస్తాము అంటూ టిఎస్ ఆర్టిసి ఎండి సజ్జనార్ చెబుతున్నారు.
ఇకపోతే ఇటీవల సజ్జనార్ తీసుకునే నిర్ణయం పై ప్రశంసల వర్షం కురుస్తోంది. మహిళ ప్రయాణికులు తమ పిల్లలతో బస్టాండ్ కు వచ్చినప్పుడు ఇక చనుపాలు ఇవ్వడానికి ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేశారు అన్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు ఏకంగా చంటి పిల్లల తో స్టేషన్లకు వచ్చే తలలు కోసం ఇక ఇలాంటి కొత్త సౌకర్యాలు కల్పించడంపై ఎంతోమంది తల్లులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కేవలం ఇలా మాత్రమే కాకుండా తరచూ ఆర్.టి.సి బస్సులో ప్రయాణిస్తూ ప్రయాణికుల అవసరాలను ఇబ్బందులను కూడా స్వయంగా తెలుసుకున్నారు సజ్జనార్.