దేశ రాజకీయాల్లో ఇప్పటి వరకు బీజేపీ మరియు కాంగ్రెస్ పార్టీలు పోటా పోటీ అనుకున్నాము. కేవలం ఈ రెండు పార్టీలదే ఏ ఎన్నికల్లో అయినా హవా? ఒకరికి ఒకరు మాత్రమే పోటీ అని నిన్నటి వరకు అనుకున్న సామాన్య ప్రజలు మరియు రాజకీయ విశ్లేషకులకు నిన్న వెలువడ్డ అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు షాక్ ఇచ్చాయి అని చెప్పాలి. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవా మరియు పంజాబ్ రాష్ట్రాలలో జరిగిన ఎన్నికలకు నిన్న ఫలితాలు వచ్చాయి. అయితే ఈ అయిదు రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ పోటీ ఇవ్వడం కాదు కదా... దరి దాపుల్లోకి కూడా రాలేక దారుణంగా చతికిలపడింది.

ఆఖరికి ఎంత దారుణం అంటే అధికారంలో ఉన్న పంజాబ్ లోనూ ఘోర పరాభవం ఎదురైంది. ఎంతలా అంటే సీఎం గా ఉన్న చన్నీ మరియు పిసిసి అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్దూ ఇద్దరూ కూడా ఓటమి పాలవ్వడం చూస్తుంటే పంజాబ్ లో ప్రజలు కాంగ్రెస్ పై ఎంతటి వ్యతిరేకతను పెంచుకున్నారు అనేది అర్థమవుతోంది. దీనితో ఒక స్థానిక పార్టీ అయిన ఆప్ కు అధికారాన్ని కోల్పోయింది. అయితే ఇక్కడ కాంగ్రెస్ వైఫల్యానికి అంతర్గత విభేదాలు ప్రధాన కారణంగా నిలిచాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు. మిగిలిన రాష్ట్రాలలో కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు. ఈ ఎన్నికల ముందు వరకు మూడు రాష్ట్రాలలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ కాస్తా రెండు రాష్ట్రాలకు పడిపోయింది.

ఇప్పుడు కేవలం రాజస్థాన్ మరియు ఛత్తీస్గఢ్ రాష్ట్రాలలో మాత్రమే అధికారంలో ఉంది. అయితే రోజు రోజుకి కాంగ్రెస్ బలహీనంగా మారుతోంది. దేశ రాజకీయాల్లో ఘనమైన చరిత్ర ఉన్న ఒక జాతీయ పార్టీ ఇంతలా బలహీనపడడానికి చాలా కారణాలు ఉన్నాయి. కనీసం ఇప్పటికైనా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ మరియు రాహుల్ గాంధీలు ఓటమి వెనుక ఉన్న వాస్తవాలను గ్రహించి ఇక ముందు జరిగే ఎన్నికలకు సన్నద్ధం కావాలి లేదంటే ఇండియాలో కాంగ్రెస్ పార్టీ అంతరించిపోయే ప్రమాదం లేకపోలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: