ఇటీవల వరుస వివాదాలు తర్వాత సీఎల్పీలో ఆసక్తికర సన్నివేశం నెలకొంది. ఈ డి ఆఫీస్ కి వెళ్లి ఫిర్యాదు చేసిన అనంతరం రేవంత్ రెడ్డి సీఎల్పీ కార్యాలయానికి వచ్చారు. ఇదే సమయంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసెంట్, ఎమ్మెల్యే జగ్గారెడ్డి అక్కడే ఉన్నారు. దీంతో ఇద్దరూ కలిసి ఆప్యాయంగా కౌగిలించుకున్నారు. ఒకరి చేతిలో ఒక చేయి వేసుకొని మీడియాకు పోజులిచ్చారు.
రేవంత్ రెడ్డికి టిపిసిసి పట్టం తర్వాత జగ్గారెడ్డి తరచూ వివాదాలకు ఆజ్యం పోస్తున్నారు. ఇప్పటికే రెండు సార్లు రాజీనామా చేస్తానని బెదిరింపులకు దిగారు. రేవంత్ రెడ్డిని పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేయడం మాత్రమే కాకుండా.. ఆయన చేసే వ్యాఖ్యలపై సైతం వ్యతిరేక ప్రకటనలు చేస్తున్న విషయం తెలిసిందే. సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు, నిరుద్యోగుల అంశం, ఐఏఎస్ లపై రేవంత్ చేస్తున్న విమర్శలను జగ్గారెడ్డి కొట్టిపారేస్తూ వచ్చారు. ఈ వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో రెండు మూడు రోజుల కిందట అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా సీఎల్పీకి రేవంత్ రెడ్డి వచ్చారు. అదే సమయంలో సీఎల్పీ లోనే ఉన్నా