అసలు ఈ గంటా శ్రీనివాసరావు రాజకీయం ఏంటో అర్ధం కావట్లేదు...ఈయన ఎప్పుడు ఎలాంటి రాజకీయ కాన్సెప్ట్ తో ముందుకొస్తారో తెలియడం లేదు...ఇంతకాలం ఈయన ఏ పార్టీలోకి వెళ్తారు..ఏ నియోజకవర్గంలో పోటీ చేస్తారనే విషయాలపై క్లారిటీ వచ్చేది కాదు...కానీ ఇప్పుడు ఈయన ఏ క్షణం ఎలాంటి రాజకీయం చేస్తారో తెలియడం లేదు..అది టీడీపీకి అనుకూలంగా చేస్తున్నారో? లేక వైసీపీని లేపాలని చూస్తున్నారో? అది కాకపోతే జనసేనకు ఊపు తీసుకురావాలని చూస్తున్నారో అర్ధం కావడం లేదు.

ఉండటానికి ఈయన టీడీపీలోనే ఉన్నారు..2014 నుంచి టీడీపీలోనే పనిచేస్తున్నారు...అధికారంలో ఉన్నప్పుడు మంత్రిగా చేశారు..అధికారం కోల్పోయాక ఎమ్మెల్యేగా గెలిచిన సరే పార్టీలో కనిపించడం లేదు...సరే నియోజకవర్గంలోనైనా కనిపిస్తున్నారా? అంటే అది లేదు...పోనీ వేరే పార్టీలోకి వెళ్తారా అంటే అది లేదు. అసలు టోటల్ గా ఊహకు అందని రాజకీయం నడిపిస్తున్నారు.

ఇటీవల కాపు నేతలతో కలిసి హైదరాబాద్ లో సమావేశమయ్యారు..ఈ మధ్య కూడా విశాఖలో సమావేశమయ్యారు...మరి ఈ సమావేశాలు టీడీపీ కోసమేనా అంటే ఏమో ఎవరికి క్లారిటీ ఉండదు...పైగా ఆ సమావేశాల్లో టీడీపీ కాపు నేతలు పెద్దగా ఉండరు. మరి గంటా ఏం చేస్తున్నారయ్య? అంటే ఏమో అండి...గంటా గురించి మమ్మలని అడగొద్దని విశాఖ టీడీపీ శ్రేణులు చెప్పే పరిస్తితి...ఆయన ఉంటే ఉంటారు లేకపోతే లేదు అన్నట్లే టీడీపీ శ్రేణులు కూడా ఉన్నాయి.  

అంటే గంటాపై సొంత పార్టీ వాళ్ళకే నమ్మకం లేదు...మరి ఈయన కోసం పనిచేస్తున్నారు అంటే అది క్లారిటీ లేదు..కాపులతో సమావేశం అవుతున్న గంటా జనసేన కోసమే పనిచేస్తున్నారని కొందరు అంటారు...కాదు కాదు కాపుల ఓట్లని చీల్చడానికి గంటా ప్లాన్ చేశారని, అలా చేసి వైసీపీకి లాభం చేకూర్చాలని అనుకుంటున్నారని మరికొందరు చెబుతున్నారు.

సరే అది అర్ధం కావట్లేదు...మరి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు...స్టీల్ ప్లాంట్ కోసమని చెబుతారు...కానీ దాని కోసం పోరాడరు...ఏడాది క్రితమే రాజీనామా చేసి..మళ్ళీ ఇప్పుడు రాజీనామా ఆమోదించాలని స్పీకర్ కోరుతున్నారు...స్పీకర్ ఏమో ఆమోదించడం లేదు...మరి ఈ గంటా కాన్సెప్ట్ ఏంటో అర్ధం కాకుండా ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: