గల్లీ నుంచి ఢిల్లీ దాకా కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకూ దిగజారుతూ వస్తోంది. ఎంతో క్యాడర్ కలిగినటువంటి ఈ పార్టీకి సీనియర్ నేతల మధ్య  సఖ్యత కుదరక ఓటమి పాలు అవుతూ వస్తోంది. దీంతో తెలంగాణ కాంగ్రెస్ లో ఎఫెక్ట్  పడే అవకాశం ఉన్నందున  పార్టీ సీనియర్ నేతలు  ముందుగానే గ్రహించి ప్రజల్లోకి వెళ్లాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. తెలంగాణలో పరిస్థితి ఎలా ఉందో తెలుసుకుందాం..?
తెలంగాణ కాంగ్రెస్ పద్మవ్యూహంలో చిక్కుకున్నది. రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ అయ్యాక కొత్త జోష్ కనిపించినా..సీనియర్లు, అసంతృప్తుల రూపంలో ఇబ్బందులు తలెత్తుతూనే ఉన్నాయి. ఇటీవల విడుదలైన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు పార్టీకి ప్రతికూలంగా రావడం గోరుచుట్టు రోకటి పోటులా మారాయి. గ్రామస్థాయి నుంచి పటిష్ట నిర్మాణం ఉన్నా సొంత పార్టీలో నెలకొన్న అసమ్మతి హస్తం నేతలను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. మరోవైపు బిజెపి లో కొత్త జోష్ కనిపిస్తున్నది. కష్టాల కడలిలో కొట్టుమిట్టాడుతున్న కాంగ్రెస్ ను కాషాయ కండువా కప్పుకునేందుకు పలువురు సీనియర్లు సైతం రెడీ అవుతున్నారు.

కేడర్ లో ఆత్మస్థైర్యం నింపడం,సీనియర్లను కాపాడుకోవడం టిపిసిసి ముందున్న పెద్ద సవాల్ అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఐదు రాష్ట్రాల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ నడిరోడ్డున నిలబెట్టాయి. రాష్ట్రంలో రాజకీయ వాతావరణం తమకు అనుకూలంగా ఉందని భావిస్తున్న తరుణంలో గడ్డు పరిస్థితులు ముందుకొచ్చాయి. ఐదు రాష్ట్రాల్లో పార్టీ ఘోర పరాజయం పాలవడం శ్రేణులను ఇబ్బందుల్లోకి నెట్టింది.

 ఇప్పటికే రాష్ట్ర కాంగ్రెస్లో అంతర్గత గొడవలు రచ్చకెక్కాయి వివాదాలు ఢిల్లీని తాకాయి. వీటన్నింటిని నుంచి పార్టీని బయటపడేయటమే కాదు.. నేతల్లోనూ భరోసా ఇంపడం టీపీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి ముందున్న ప్రధాన కర్తవ్యం. ఓ వైపు సొంత పార్టీ నేతలు తిరుగుబాట్లు,వ్యతిరేక విమర్శలు, ప్రతీ మాటకు అడ్డు చెబుతుండడం, మరోవైపు ఐదు రాష్ట్రాల ఎన్నికలు, అటు బిజెపి స్పీడును అడ్డుకోవడం, టిఆర్ఎస్ వ్యూహాలను దెబ్బకొడుతూ పార్టీని ముందుకు నడిపించడం రేవంత్ రెడ్డికి పెద్ద టాస్క్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: