ప్రత్యక్షంగా జరిగిన ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి దెబ్బకు చంద్రబాబునాయుడు చిత్తుగా ఓడిపోయారు. ఓటమిని జీర్ణించుకోలేని చంద్రబాబు ఎలాగైనా జగన్ పై కసి తీర్చుకోవాలని డిసైడ్ అయినట్లున్నారు. అందుకనే ఆ కసినే పెండింగ్ బిల్లుల రూపంలో తీర్చుకుంటున్నారు. ఎన్నికల ఫలితాలు వచ్చి జగన్ బంపర్ మెజారిటి అధికారంలోకి వచ్చేసిన తర్వాత కూడా చంద్రబాబు దాదాపు 20 రోజులు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగాన కంటిన్యు అయ్యారు.
ఆపద్ధర్మ సీఎంగా ఉన్న వ్యక్తి ఎలాంటి విధానపరమైన నిర్ణయాలు, ఆర్ధికపరమైన నిర్ణయాలు తీసుకోకూడదు. కానీ చంద్రబాబు మాత్రం ఎన్నికల సమయంలోనే కాకుండా ఫలితాలు వచ్చిన తర్వాత కూడా యధేచ్చగా నిర్ణయాలు తీసేసుకున్నట్లు ఆరోపణలున్నాయి. ఎన్నికల్లో మళ్ళీ గెలిచేది కష్టమనే అనుమానం వచ్చినట్లుంది. అందుకనే పోలవరం ప్రాజెక్టుకు లాంటి వాటిల్లో తనకు అవసరమైన కాంట్రాక్టర్ల బిల్లులు తప్ప మిగిలిని వాటన్నింటినీ పెండింగ్ లో పెట్టేశారు. పంచాయితీ రాజ్ కాంట్రాక్టర్ల బిల్లులు, ప్రభుత్వ లాయర్లకివ్వాల్సిన ఫీజులు పెండింగ్ పెట్టేశారు.
చివరకు పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లు చేసుకున్న ప్రైవేటు విద్యుత్ సంస్ధల బిల్లులు, ఇరిగేషన్ కాంట్రాక్లర్ల బిల్లులు కూడా పెండింగే. లాయర్లకు ప్రభుత్వం చెల్లించాల్సిన ఫీజులన్నింటినీ 12 శాతం వడ్డీతో చెల్లించాలని హైకోర్టు తాజాగా తీర్పివ్వటమే ఇందుకు నిదర్శనం. మామూలుగా ఏ ప్రభుత్వం అయినా తన హయాంలో చేసిన పనులకు, చెల్లించాల్సిన బిల్లులను క్లియర్ చేసేయటం తెలిసిందే. కానీ చంద్రబాబు మాత్రం వేల కోట్ల రూపాయల బిల్లులను పెండింగ్ పెట్టేసి దిగిపోయారు. ఇపుడవన్నీ జగన్ మెడకు చుట్టుకున్నాయి.
చంద్రబాబు హయాంలో చేయాల్సిన బిల్లులను చెల్లించలేక, ఇపుడు బిల్లులు చెల్లించేందుకు సరిపడా డబ్బులు లేక జగన్ ప్రభుత్వం నానా అవస్తలు పడుతోంది. అంటే జగన్ పై చంద్రబాబు ఎంతలా కసి తీర్చుకుంటున్నారో అందరికీ అర్ధమవుతోంది. ఈ కాంట్రాక్టర్లు, లాయర్లు కూడా చంద్రబాబు హయాంలో ఏమీ మాట్లాడకుండా, కోర్టులకు ఎక్కకుండా ఇపుడు కోర్టుల్లో కేసులు వేస్తుండటమే ఆశ్చర్యంగా ఉంది.