విషయానికొస్తె.. ఈ దారుణ ఘటన ఆంధ్రప్రదేశ్ విజయవాడలో వెలుగు చూసింది..ఒరిజినల్ రీఫిల్ మాదిరిగానే లిక్విడ్ నింపి మార్కెట్లో విక్రయిస్తున్నారు. సాధారణంగా నిత్యావసర వస్తువులు, తినుబండారాల్లో కల్తీ జరగడం ఎక్కడో చోట బయట పడుతుంది. ఇప్పుడు విజయవాడ కొత్త దందా వెలుగు చూసింది.పాతబస్తీ పులిపాటివారి వీధిలో ఉన్న సాయి ధనలక్ష్మి ఫ్యాన్సీ షాపులో నకిలీ మస్కిటో రీఫిల్స్ వెలుగులోకి వచ్చాయి.బెజవాడలో నకిలీ మాఫియా కొత్త పుంతలు తొక్కుతోంది. దానికి నకిలీ మస్కిటో రీఫిల్సే లేటెస్ట్ ఎవిడెన్స్. న్యూఢిల్లీకి చెందిన అస్సిడౌస్ కన్సల్టింగ్ సీనియర్ ఇన్వెస్టిగేష్ అధికారి ఈ గుట్టు గురించి లాగడంతో అసలు విషయం బయటకు వచ్చింది.
పోలీసులు బెజవాడ పాతబస్తీ లో సాయి ధనలక్ష్మి షాపులో నకిలీ రీఫిల్స్ అమ్ముతున్నట్టు గుర్తించి పోలీసులకు కంప్లయింట్ చేశారు. ఆ షాప్ పై పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేయగా ఈ ఘటన వెలుగు చూసింది. 250 నకిలీ రిఫీల్స్ బయటపడ్డాయి. వాటిని ఫోరెన్సిక్ ల్యాబ్‌కి పంపారు..పోలీసులు దుకాణ దారుడి పై కేసు నమోదు చేశారు. వారికి ఈ సరుకు ఎక్కడి నుంచి వస్తున్నాయి. అని ఆరా తీసారు. దీంతో విషయం బయటకు పొక్కింది.. పూర్తీ వివరాలు తెలియాల్సి ఉన్నాయి.