కొత్తనీటి కోసం పాతనీరు దారివ్వాల్సిందే అనేది ప్రకృతి నియమం. ఇదే సూత్రాన్ని జగన్మోహన్ రెడ్డి కూడా ఫాలో అవబోతున్నట్లు సమాచారం. కొత్తగా తీసుకోబోయే మంత్రుల కోసం పాత మంత్రులు అందులోను సీనియర్లు త్యాగాలకు సిద్దంగా ఉండాల్సిందే అని జగన్ స్పష్టంగా చెప్పేశారట. ప్రస్తుత మంత్రివర్గంలో అత్యంత సీనియర్లంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్సా సత్యనారాయలు మాత్రమే.





వీళ్ళిద్దరే అత్యంత సీనియర్లు ఎందుకంటే కాంగ్రెస్ హయాంలోనే వీళ్ళు మంత్రులుగా పనిచేశారు కాబట్టి. విశ్వరూప్ లాంటి ఒకరిద్దరు కూడా పనిచేసినా బొత్స, పెద్దిరెడ్డి ఇద్దరు మంచి ఫోకస్ పాయింట్లో ఉన్నారు. కాబట్టి అందరి కళ్ళు వీళ్ళమీదే ఉంటాయి. ఇలాంటి వీళ్ళనే మంత్రిపదవులను త్యాగాలు చేయటానికి రెడీగా ఉండాలని జగన్ చెప్పారంటే ఇక మిగిలిన వాళ్ళెంత ? అనే చర్చ జరుగుతోంది. ఇద్దరు ముగ్గురు మంత్రులను తప్ప మిగిలినందరినీ జగన్ మార్చేయబోతున్నట్లు ప్రచారం పెరిగిపోతోంది.





అత్యంత సీనియర్ మంత్రులనే మార్చేస్తున్నపుడు మిగిలిన వాళ్ళ విషయంలో జగన్ మొహమాటానికి పోచే ఛాన్సేలేదు. మంత్రివర్గం నుండి తప్పించిన వాళ్ళందరినీ పార్టీ బలోపేతానికి, వచ్చే ఎన్నికల్లో తిరిగి అధికారంలోకి రావటానికి ఉపయోగించుకుంటానని స్వయంగా జగనే చెప్పారు. కాబట్టి మంత్రులందరు ముందైతే త్యాగాలకు సిద్ధంగా ఉండాల్సిందే. మొత్తంమీద మంత్రివర్గ పునర్వ్యవస్ధీకరణ అన్నది పెద్ద దుమారాన్ని రేపేట్లుగానే ఉంది చూస్తుంటే. అయితే ఎవరు ఏమీ చేయగలిగేదేమీ లేదు.




కాకపోతే జగన్ కు అతిపెద్ద ప్లస్ పాయింట్ ఏమిటంటే ప్రతిపక్షాల్లో ఏది కూడా వైసీపీని చాలెంజ్ చేసేంత సీన్లో లేకపోవటమే. మంత్రివర్గం నుండి తప్పించిన వారికి సహజంగానే అలకలు, అసంతృప్తులుంటాయి. అలంటివాళ్ళు జగన్ మీద కోపంతో ఇతర పార్టీల్లోకి వెంటనే వెళ్ళిపోయే ఛాన్స్ దాదాపు లేదనే చెప్పాలి. ఎందుకంటే వైసీపీయేమో బలంగా ఉంటే ప్రతిపక్షాలు చాలా బలహీనంగా కనిపిస్తున్నాయి. బలహీనంగా ఉన్న పార్టీల్లోకి వెళ్ళి ఎవరైనా చేయగలిగేదేముంటుంది ? కాబట్టి ఇష్టమున్నా లేకపోయినా త్యాగాలకు అందరు సిద్ధంగా ఉండాల్సిందే అని అందరికీ అర్ధమైపోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: