
మేం తెచ్చిన వాటిని కంటిన్యూ చేసినా చాలా పరిశ్రమలు వచ్చుండేవని.. వచ్చీ రావడంతోనే పీపీఏల రద్దు అంటూ ప్రకటించిన జగన్.. పెట్టుబడిదారుల్లో భయాందోళనలు పుట్టించారని పేర్కొన్నారు నారా లోకేష్. పీపీఏల రద్దు కారణంగా సుజలాన్ అనే అతి పెద్ద కంపెనీ దివాళ తీసింది.. అందులో పెట్టుబడులు పెట్టిన చాలా పెద్ద పెద్ద కంపెనీలు దెబ్బతిన్నాయని అన్నారు నారా లోకేష్. ఏపీ ఆర్ధిక పరిస్థితి శ్రీలంక ఆర్ధిక పరిస్థితితో సమానంగా ఉందని.. పరిస్థితి ఇలాగే ఉంటే ఏపీలో ఏదో రోజు ఆర్ధిక ఎమర్జెన్సీ ప్రకటించే పరిస్థితి వస్తుందని నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఆర్ధిక ఎమర్జెన్సీ వస్తే బ్యాంకుల్లో ఉన్న ప్రజల డబ్బు, బంగారాన్ని కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకోవచ్చన్నారు నారా లోకేష్. పీపీఏల రద్దు నిర్ణయంతో ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు కంపెనీలు జంకుతున్నాయని ఆయన చెప్పారు.