తెలుగురాష్ట్రాల విషయంలో నరేంద్రమోడి సర్కార్ దాదాపు ఒకే విధంగా వ్యవహరిస్తోంది. ఏపీ ప్రయోజనాలను తుంగలో తొక్కేస్తోంది. అటు తెలంగాణాలో కూడా డెవలప్మెంట్ చేయటంలేదు. రెండు రాష్ట్రాల్లోను ఎదగాలని కలలుకంటున్న బీజేపీ హోలు మొత్తంమీద ప్రజలను మాత్రం దగా చేస్తోంది. అయితే కేంద్రానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి చాలా కూల్ గా డీల్ చేస్తుంటే తెలంగాణా సీఎం కేసీయార్ మాత్రం నానా గోల చేస్తున్నారు. రోజు రోజుకు కేంద్రంపై రెచ్చిపోతున్నారు.
కేంద్రాన్ని కావచ్చు లేదా బీజేపీని కావచ్చు జగన్-కేసీయార్ డీల్ చేస్తున్న విధానంలోనే అందరికీ స్పష్టత తెలిసిపోతోంది. జగన్ కూల్ గా ఉంటే కేసీయార్ మాత్రం ఎందుకంతలా రెచ్చిపోతున్నారు ? ఎందుకంటే ఏపీలో బీజేపీ విషయంలో జగన్ హ్యాపీగా ఉండచ్చు. ఎందుకంటే బీజేపీకి రాష్ట్రంలో ఠికాణా లేదు. ఎక్కడ ఎన్నికలు జరిగినా కనీసం డిపాజిట్లు కూడా తెచ్చుకునేంత సీన్ లేదు. అందుకనే బీజేపీని జగన్ అసలు పట్టించుకోవటమే లేదు.
ఇదే తెలంగాణా విషయం చూస్తే సీన్ రివర్సులో ఉంది. వచ్చే ఎన్నకల్లో బీజేపీని కేసీయార్ తనకు థ్రెట్ గా చూస్తున్నారు. టీఆర్ఎస్ ను దెబ్బకొట్టి బీజేపీ ఎక్కడ అధికారంలోకి వచ్చేస్తుందో అనే టెన్షన్ కేసీయార్ లో స్పష్టంగా కనిపిస్తోంది. అందుకనే టీఆర్ఎస్-బీజేపీ నేతల మధ్య ప్రతిరోజు ఎక్కడో ఓ చోట గొడవ జరుగుతునే ఉంది. బీజేపీ చీఫ్ బండి సంజయ్ కూడా రెగ్యులర్ గా కేసీయార్ ను టార్గెట్ చేస్తు రచ్చ రచ్చ చేస్తున్నారు. ప్రత్యక్షంగానో, పరోక్షంగానో కేసీయార్ పై బీజేపీ బాగా ఒత్తిడి పెంచేస్తోంది.
ఏపీలో జగన్ కు లేని బీజేపీ సమస్య తెలంగాణాలో కేసీయార్ కు ఎక్కువైపోయింది. మామూలుగా అయితే తెలంగాణాలో కూడా బీజేపీకి అధికారంలోకి వచ్చేసేంత సీన్ లేదు. 119 నియోజకవర్గాల్లో గట్టి అభ్యర్ధులను కూడా పెట్టుకునే పరిస్ధితిలేదు. అయినా సరే అధికారంలోకి వచ్చేస్తామంటు చేస్తున్న గోలే కేసీయార్ లో టెన్షన్ పెంచేస్తోంది. అందుకనే కేసీయార్ కూడా కేంద్రంపై రెచ్చిపోతున్నారు.