త్వరలోనే తెలంగాణ రాష్ట్రంలోనూ టీడీపీని బలోపేతం చేస్తానని ప్రకటన చేశారు చంద్రబాబు.  టీడీపీకి ప్రత్యేకత ఉంది. ఓ శుభ ముహూర్తంన పార్టీ పెట్టారు. ఎన్నో కష్టాలు వచ్చిన నిలదొక్కుకున్నామన్నారు చంద్రబాబు.  ఎన్టీఆర్ అధికారం కోసం పార్టీ పెట్టలేదు. ఉనికి లేని జాతి కోసం ముందుకు వచ్చారు... ఆవేశంలో పుట్టిన పార్టీ టీడీపీ. క్యాలిక్ లేషన్స్ తో పుట్టిన పార్టీ కాదని పేర్కొన్నారు చంద్రబాబు.  తెలుగు వారి ఆత్మగౌరవం ప్రపంచ నలుమూలల చాటి చెప్పిన వ్యక్తి ఎన్టీఆర్ అని.. ప్రజల ఒంట్లో ప్రవహించేంది టీడీపీ రక్తమేనన్నారు చంద్రబాబు.  తెలుగువారి గుండె చప్పుడు తెలుగుదేశం పార్టీ... నరనరాల్లో ఉంది టీడీపీ. ఎప్పుడు ప్రజల పక్షమే టీడీపీ.. తెలుగుదేశం పార్టీ ముందు రాజకీయ నాయకులు వేలి ముద్రలు వేసే వాళ్ళు. కొందరు భూస్వాములు తమ తాబేదార్లకు అధికారం కట్టబెట్టేవారని చెప్పారు చంద్రబాబు.
 
టీడీపీ ఇప్పుడు ఆలోచిస్తే... తర్వాత ఆలోచించేది ఇతర పార్టీలు అని.. దుర్మార్గుడు ఏపీలో మీటర్ పెట్టాలంటున్నాడు... మీటర్ పెడితే రైతు మెడకు ఉరి తాడేనని పేర్కొన్నారు చంద్రబాబు.  వెనుకబడిన వర్గాలకు, బీసీలకు రిజర్వేషన్లు కల్పించామమన్నారు చంద్రబాబు. హైదరాబాద్ డెవలప్మెంట్ కు కారణం నేనే... ఊరికే హైటెక్ సిటీ నిర్మాణం అవుతుందా? ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్, ఐఎస్బీ హైదరాబాద్ కు తెచ్చింది నేనే అని చెప్పారు చంద్రబాబు.  రాను అని చెప్పిన వారిని నా దగ్గరకు రప్పించుకొని ఆ తర్వాత తప్పించుకోకుండా ఉంచడం నాకు తెలుసని... బయోటెక్నాలజీకి మంచి రోజులు వస్తున్నాయని ముందే ఊహించి జినోమ్ వ్యాలీ ఏర్పాటు చేశామని స్పష్టం చేశారు చంద్రబాబు.  ఇప్పుడు జినోమ్ వ్యాలీలో కరోనకు వ్యాక్సిన్ తయారు చేయడం గొప్ప పరిణామమని.. బిల్ గెట్స్ 5 నిమిషాలు సమయం ఇచ్చి... అర్ధ గంట నాతో మాట్లాడారన్నారు చంద్రబాబు.  నా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చూసి బిల్ గెట్స్ ఆకర్షితుడైయ్యారని.. దావూద్ కు వెళ్లి బిల్ గెట్స్ సమావేశం నిర్వహించా మైక్రోసాఫ్ట్ హైదరాబాద్ లో పెడతామని చెప్పి... ఇక్కడే పెట్టారు అప్పటి నుంచి నాకు మంచి స్నేహితుడు అయ్యారన్నారు చంద్రబాబు.


మరింత సమాచారం తెలుసుకోండి: