మందుబాబులకు ఎంత చెప్పిన వినరు.. ఆరోగ్యం పై ఎన్ని విధాలుగా చెప్పిన కూడా వాళ్ళు వినరు..మత్తులో మనసులోని బాధలు అన్నీ పోతాయని అంటున్నారు.కాయ కష్టం చేసుకొనే కూలి దగ్గరి నుంచి కరెన్సీ లో పుట్టి పెరిగిన వాళ్ళు కూడా మందుకు బానిసలుగా మారుతున్నారు.. ప్రభుత్వాలు మద్యం సెవిస్తె వచ్చే ప్రమాదాల గురించి చెబుతూనె మరో వైపు మద్యం అమ్మకాలను పెంచుకుంటూ వస్తున్నారు. అంతే కాదు ఎన్నో ఆఫర్లను కూడా అందిస్తున్నారు..తాజాగా చండీగఢ్ ప్రభుత్వం మద్యం ప్రియులకు గుడ్ న్యూస్ చెప్పింది. కొత్త మద్యం పాలసీ పాలసీని 2022-23 ను ఆమోదించింది..


ఈ ఆమోదం ప్రకారం బార్ లు, రెస్టారెంట్లు, హోటళ్లలో తెల్లవారుజామున 3 గంటల వరకు మద్యం అమ్మకాలకు అనుమతినిస్తు కొత్త ఎక్సైజ్ పాలసీని అందుబాటులొకి తీసుకొని వచ్చింది.. ఇది కొందరికి గుడ్ న్యూస్ అయిన మరి కొంతమంది కి షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి. ఇప్పటివరకు రాత్రి 1 వరకూ మాత్రమే అందుబాటులో ఉన్నాయి.ప్రభుత్వానికి అదనపు ఫీజు చెల్లిస్తే మరొ రెండు గంటలు బార్ లు తెరిచి ఉంచుకోవడానికి అనుమతి ఇచ్చింది. ఈ కొత్త పాలసీతో వినియోగదారులు, తయారీ దారులు, టోకు , చిల్లర వ్యాపారులకు లాభం అందనుందని తెలుస్తుంది.


ప్రభుత్వానికి కూడా మంచి ఆదాయం అందే అవకాశం ఉందని తెలుస్తుంది.. ఇకపోతే పలు రాష్ట్రాల్లో కూడా ఇదే జివొ ను అమలు లోకి తీసుకు వచ్చినట్లు తెలుస్తుంది.. ఇకపోతే హైదరాబాద్ లో డ్రగ్స్ వ్యవహారం జొరుగా సాగుతుంది..తాజా డ్రగ్స్ కేసులో సంచలన విషయాలెన్నో వెలుగులోకి వస్తున్నాయి. బంజారాహిల్స్ ప్రాంతంలోని రాడిసన్ బ్లూ పబ్బు లో డ్రగ్స్ దందా సంచలనంగా మారింది.150 మందిని అరెస్ట్ చేశారు.. సినీ, రాజకీయ ప్రముఖులు కూడా డ్రగ్స్ కేసులో నోటిసులు అందుకున్నారు.ప్రస్తుతం ఈ కేసును నార్కోటిక్స్ ఎన్ ఫోర్స్ మెంట్ వింగ్, వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్, బంజారాహిల్స్ పోలీసులు అదుపులో విచారణ చేపట్టారు.. ప్రభుత్వం ఇలా ఎంకరేజ్ చెస్తె ఇలానే జరుగుతాయని కొందరు ఆరొపిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: