RIP అనేది ఒక షార్ట్ వర్డు అయినప్పటికీ ఇప్పుడు ఇది ఒక పదం గా వాడేస్తున్నారు. ఇంతకీ ఇక RIP అర్థం ఏమిటి అంటే ఎవరైనా మరణించిన తర్వాత సంబంధీకులు ఇక ఈ పదం ద్వారా తమ బాధను వ్యక్తపరుస్తూ అతని ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ ఉంటారు.. ఈ అర్థం కొంతమందికి తెలుసు. మరి RIP అనే పదానికి ఖచ్చితమైన అర్థం ఏమిటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.. RIP అంటే రెస్ట్ ఇన్ పీ..స్ ఇది ఒక లాటిన్ పదబంధం. రిక్వెస్ కాట్ ఇన్ పీస్ నుంచి ఉద్భవించింది. ఈ పదం రిక్వెస్ కాట్ ఇన్ పీస్ అంటే శాంతి లో నిద్రపోవడం.
ఇక తెలుగులో ఈ పదానికి అర్థం ఆత్మకు శాంతి కలగాలి అని.. మరణం తర్వాత ఆత్మ శరీరం నుండి విడి పోతుంది. అయితే తర్వాత తీర్పు దినం రోజున 2 తిరిగి కలుస్తాయని.. క్రైస్తవ మతంలో నమ్ముతుంటారు. ఒక వ్యక్తి మరణిస్తే అతని ఆత్మ యేసుక్రీస్తు తో సరిపోలుతుంది అని చెబుతూ ఉంటారు. అయితే ఇలా RIP అనే పదాన్ని ఉపయోగించడం 18 వ శతాబ్దానికి చెందినది అని అంటూ ఉంటారు. 5వ శతాబ్దంలో సమాధులపై రిక్వెస్ట్ కాట్ ఇన్ పీస్ అనే పదాలు కనిపించాయి. అయితే క్రిస్టియానిటీ వ్యాప్తి తోనే ఇక ఈ పదం వాడకం పెరిగింది అనేది తెలుస్తుంది. దీని ద్వారా ప్రపంచ వ్యాప్తంగా వాడుకలో వచ్చింది. ఇప్పుడు ఎవరైనా చనిపోతే ప్రతి ఒక్కరు కూడా RIP అంటూ చెబుతూ నివాళులు అర్పిస్తున్నారు అన్న విషయం తెలిసిందే..