ఎల్లోమీడియాకు జగన్మోహన్ రెడ్డి హయాంలో పనిదొరికినట్లు గతంలో ఎవరి హయాంలోను దొరకలేదని చెప్పాలి. జగన్ పాలనపై రాష్ట్రంలో ఏ స్ధాయిలో ఎల్లోమీడియా బురద చల్లుతోందో అందరు చూస్తున్నదే. అలాంటిది జగన్ ఢిల్లీ పర్యటనంటే చెప్పాల్సిన అవసరమే లేదు. నోటికొచ్చింది రాసేస్తున్నారు. బుర్రకు తోచించి అచ్చేసేస్తున్నారు. మూడోకంటికి తెలిసే అవకాశంలేదని భేటీల విషయంలో కూడా తమ ఊహాశక్తికి పదును పెట్టి ఏదేదో రాసేస్తున్నారు.
జగన్ ఢిల్లీ పర్యటనకు సంబంధించి ఎప్పుడైనా సరే ఎల్లోమీడియా వైఖరి ఇలాగే ఉంటోంది. తాజాగా అదే విషయం మరోసారి వెలుగుచూసింది. దాదాపు గంటసేపు నరేంద్రమోడితో తర్వాత హోంశాఖ మంత్రి అమిత్ షాతో జగన్ భేటీఅయ్యారు. అమిత్ షా తో భేటీలో వాళ్ళిద్దరు ఏమి మాట్లాడుకున్నారనే విషయం వాళ్ళిద్దరిలో ఎవరో ఒకరు చెబితే తప్ప బయటకు తెలీదు. కానీ ఎల్లోమీడియా మాత్రమే బ్రహ్మాండమైన కథనాన్ని అచ్చేసేసింది.
బాబాయ్ హత్యకేసులో కడప ఎంపి అవినాష్ రెడ్డిని బయటపడేయటం, తన మీడియా సాక్షికి అనుమతులు ఇప్పించుకునే విషయాన్ని జగన్ ప్రస్తావించారట. అమరావతిపై హైకోర్టు తీర్పును ప్రస్తావించారట. అలాగే రాజ్యసభ ఎంపీల ఎంపిక విషయంలో బీజేపీ ఎవరిని ప్రతిపాదిస్తే వారికి అవకాశం కల్పిస్తానని ప్రతిపాదించారట. నిజానికి ఇందులో అంశాలన్నీ పూర్తిగా ఊహాజనితమే. మీడియాకు మోడి, అమిత్ షా లేదా జగన్ ఎవరు చెప్పే అవకాశంలేదు. ఇలాంటి ఊహాజనితమైన నెగిటివ్ వార్తలు, కథనాలతో మరో రెండేళ్ళు ఎల్లోమీడియాకు ఫుల్లు పండగే పండగ.
దాన్ని అవకాశంగా తీసుకుని ఎల్లోమీడియా తనకు బుద్ధి పుట్టినట్లు రాసేస్తుంది. గతంలో కూడా జగన్ను అమిత్ షా ఫుల్లుగా క్లాసు పీకారని రాసింది. జగన్ పై అమిత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారని రాసింది. ఇలాంటి రాతలు రాయటం తప్పని ఎల్లోమీడియాకు కూడా బాగా తెలుసు. అయినా సరే ఏదోవిధంగా జగన్ను గబ్బుపట్టించటమే టార్గెట్ కాబట్టి ఊహాజనితమైన తప్పుడు రాతలు రాస్తోంది. మొత్తానికి జగన్ ఉన్నంతవరకు ఎల్లోమీడియాకు చేతినిండా పనుంటుందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మంచిని మంచిగా చెడును చెడుగా చూడాల్సిన మీడియా కేవలం చంద్రబాబునాయుడు రాజకీయ ప్రయోజనాలను రక్షించటమే ధ్యేయంగా పనిచేస్తోంది కాబట్టే ఒక సెక్షన్ ఆఫ్ మీడియాను ఎల్లోమీడియా అంటోంది.