వచ్చే ఎన్నికల్లో వైసీపీ గెలుచుకోవాల్సిన స్ధానాల సంఖ్య విషయంలో జగన్మోహన్ రెడ్డి స్పష్టంగా టార్గెట్ ఫిక్స్ చేసినట్లు సమాచారం. క్యాబినెట్లో మంత్రులతో జగన్ మాట్లాడుతు వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా 160 సీట్లు గెలుచుకోవాల్సిందే అని టార్గెట్ సెట్ చేసినట్లు తెలిసింది. ప్రజలను ఆదుకునేందుకు ఇన్ని సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న కారణంగా ప్రభుత్వంపై జనాల్లో కూడా బాగానే సానుకూల స్పందన ఉన్నట్లు చెప్పారట.





పనిలోపనిగా చంద్రబాబునాయుడు రాజకీయ జీవితాన్ని పూర్తిగా దెబ్బకొట్టాలంటే వైసీపీ తిరిగి గెలవాల్సిందే అని కూడా చెప్పారట. వయసు రీత్యా చూసినా రాజకీయంగా చూసినా చంద్రబాబుకు రాబోయే ఎన్నికలే చివరి ఎన్నికలు కావాలని జగన్ స్పష్టంగా చెప్పారట. తన ఆలోచనలకు తగ్గట్లే మంత్రివర్గంలోను, పార్టీలోను భారీగా మార్పులు చేయబోతున్నట్లు చెప్పారట. ఏదేమైనా జగన్ తన టార్గెట్ విషయంలో చాలా స్పష్టంగా ఉన్నట్లు తెలుస్తోంది. 





మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయబోయే వారు, పార్టీ బాధ్యతలు తీసుకోబోతున్న వారు వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని స్పష్టంగా చెప్పారు. ఇందులో భాగంగానే ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, ఇతర అభివృద్ధి కార్యక్రమాల వల్ల కచ్చితంగా 160 సీట్లు గెలిచితీరాలని టార్గెట్ గా పెట్టుకున్నట్లు జగన్ ఔట్ గోయింగ్ మంత్రులతో చెప్పారట. ఇదే విషయాన్ని పార్టీ సమావేశంలో కూడా చెప్పటం ఖాయం. 11వ తేదీన మంత్రివర్గ పునర్ వ్యవస్ధీకరణ జరగబోతోంది కాబట్టి కొత్తమంత్రులకు కూడా టార్గెట్లు ఫిక్స్ చేయటం ఖాయం.




పనిలోపనిగా కుప్పంలో చంద్రబాబును ఓడించటమే టార్గెట్ గా ఇప్పటికే జగన్ పావులు కదుపుతున్న విషయం తెలిసిందే. దీనిలో భాగంగానే చంద్రబాబును వచ్చే ఎన్నికల్లో కోలుకోకుండా దెబ్బ కొట్టాలని టార్గెట్ గా పెట్టుకున్నారు. మొత్తానికి తన టార్గెట్ రీచ్ అవటంలో జగన్ చాలా జాగ్రత్తగా పావులు కదుపుతున్నారు. కాబట్టి పార్టీని ఉరకలెత్తించటంలో గట్టి నేతలకే బాధ్యతలు అప్పగించబోతున్నట్లు అర్ధమవుతోంది. మరి తన టార్గెట్ లో జగన్ ఏ మేరకు సక్సెస్ అవుతుందో చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: